చికాగోలో ఆకలితో అలమటిస్తోన్న హైదరాబాద్ మహిళ, కేంద్రమంత్రి సహాయం కోరిన తల్లి

మాస్టర్స్ చేదివేందుకు అగ్రరాజ్యం అయినటువంటి అమెరికాకు వెళ్లిన తెలంగాణ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది.ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ (S Jaishankar)కు లేఖ రాసింది.అక్కడ ఆ మహిళ దారుణమైన దయనీయస్థితిలో కనిపిస్తోంది.అంతేకాదు ఆమె వస్తువులన్నీ దొంగిలించబడ్డాయి.తన చేతిలో ఏమీలేక పొరుగుదేశంలో తనొక అనాథలాగా బ్రతుకుతోంది.ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
చికాగోలో ఆకలితో అలమటిస్తోన్న హైదరాబాద్ మహిళ, కేంద్రమంత్రి సహాయం కోరిన తల్లి

india-news-video-hyderabad-woman-seen-starving-on-us-roads-mother-makes-emotional-appeal-to-eam

హైదరాబాద్‌కు చెందిన మహిళ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి అమెరికా (America) వెళ్ళింది.చికాగో రోడ్లపై ఆకలితో(Hungry) అలమటిస్తోంది. ఇక కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి(Minister of External Affairs) రాసిన లేఖలో తల్లి తన కుమార్తె కష్టాలను ఇలా వివరించింది.తెలంగాణలోని మౌలాలీలో(Moulali) నివాసం ఉంటున్నామని పేర్కొంది. నా కుమార్తె సయ్యదా లులు మిన్హాజ్ జైదీ (Syed Lulu Minhaz Jaidi) ఆగస్టు 2021లో డెట్రాయిట్‌లోని TRINE విశ్వవిద్యాలయంలో(University) మాస్టర్స్ (Masters) చదివేందుకు వెళ్లి మాతో తరచుగా టచ్‌లో ఉండేది.

తన కూతురిని ఇండియాకు తీసుకురావాలని కేంద్రమంత్రి సహాయం కోరిన తల్లి

కానీ గత రెండు నెలలుగా (2Months) ఆమె నాతో టచ్‌లో ఉండడం లేదని పేర్కొంది.నా కూతురు డిప్రెషన్‌లో ఉందని ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని దీంతో ఆమె ఆకలితో అలమటించిందని లేఖలో తెలిపారు.ఆమెను తిరిగి ఇండియాకు తీసుకురావాలని సహాయం కోరింది.దీంతో తక్షణ సహాయాన్ని అభినందిస్తున్నానని రెహమాన్ ట్విట్టర్‌లో పోస్ట్‌కు శీర్షిక పెట్టారు.బీఆర్‌ఎస్() నాయకుడు ఖలీకర్ రెహమాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన తర్వాత ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.తాను పోస్ట్ చేసిన వీడియోలో కృంగిపోయిన మిన్హాజ్ ఆహారం తెచ్చిన ఒక వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతూ కనిపిస్తుంది.

విజ్ఞప్తి మేరకు చికాగోలోని భారత కాన్సులేట్ స్పందన

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి నిరాశ్రయులైన హైదరాబాద్‌కు చెందిన మహిళకు సహాయం చేయాలన్న విజ్ఞప్తిపై అమెరికాలోని చికాగోలోని భారత కాన్సులేట్(Bharath Consulet) స్పందించింది. ఆమె మానసికంగా కూడా దృఢంగా కనిపించలేదు.సయ్యద్ లులు మిన్హాజ్ కేసు గురించి మేము ఇప్పుడే తెలుసుకున్నామని కాన్సులేట్ సామాజిక కార్యకర్త మరియు MBT నాయకుడు అమ్జెద్ ఉల్లా ఖాన్‌ను ఆమె వివరాలను పంపమని కోరింది.మదద్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయబడింది.అవసరమైన చర్యల కోసం మిషన్‌కు పంపామని విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం (Wednesday) తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు