World Cup 2023:టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

మొదటి సెమీస్ సమరం మొదలైంది. ముంబై వాంఖడే స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు.

New Update
World Cup 2023:రోహిత్ ఇలా, కేన్ అలా..సెమీస్ కు రెడీ అయిన కెప్టెన్లు

తొలి సెమీస్ లో భారత్, న్యూజిలాండ్ లు ఈరోజు కీలక మ్యాచ్ ఆడుతున్నాయి. ఇందులో గెలిచిన వారు ఫైనల్స్ లోకి అడుగుపెడతారు. ఈ వరల్డ్ కప్ లో మొదటి నుంచి అన్ని మ్యాచ్ లను గెలుచుకుంటూ వస్తోంది టీమ్ ఇండియా. అదే ఊపులో సెమీస్ ను కూడా చేజిక్కుంచకుని ఫైనల్స్ లోకి అడుగు పెట్టాలని ఉవ్విళ్ళూరుతోంది భారత జట్టు. ఇక లీగ్ మ్యాచ్ లో తమను ఓడించిన భారత్ మీద గెలవాలని పట్టుదలగా ఉంది న్యూజిలాండ్. అంతేకాదు తమ గత చరిత్రను నిలుపుకోవాలని కూడా భావిస్తోంది.

ఇక ఈ కీలక మ్యాచ్‌కు టాసే హీరో కానుందా..టాస్ గెలిచిన వారే మ్యాచ్ గెలుస్తారా..ప్రీవియస్ మ్యాచ్‌ల హిస్టరీ చూస్తే ఇదే నిజమనిపిస్తుంది.ముంబై వాంఖడే స్టేడియం (Wankhede Stadium) బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించే పిచ్. ఇక్కడ పరుగుల వరద పారుతుంది. ఇక్కడ జరిగిన చాలా మ్యాచ్‌లలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నవారే గెలిచారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో (World Cup 2023) భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి మరీ బౌలింగ్‌ ఎంచుకుంది. దానికి భారీ మూల్యమే చెల్లించుకుంది కూడా. దాని ఫలితంగా 302 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలయింది. అయితే ఇదే స్టేడియంలో ఆస్ట్రేలియా మాత్రం ఆఫ్ఘాన్ మీద గెలిచింది. 292 రన్స్ చేధించి మరీ గెలిచింది. దానికి కారణం మాక్స్ వెల్ సూపర్ ఇన్నింగ్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 280+ కొట్టిన టీమ్ కేవలం ఓడిపోయింది కూడా ఈ ఒక్క మ్యాచ్ లోనే.

దీన్ని బట్టి వాంఖడే స్టేడియంలో టాస్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని అర్ధమవుతోంది. కాబట్టి ఇరు జట్లు టాస్‌ గెలిస్తే కచ్చితంగా బ్యాటింగ్‌ ఎంచుకుంటాయి. ఈ మైదానంలో మరో అడ్వాంటేజ్‌ కూడా ఉంది. బౌండరీ చిన్నదిగా ఉండటంతో బ్యాటర్లు అవలీలగా ఫోర్లు, సిక్సర్లు బాది భారీ స్కోర్లు కొట్టడం కూడా అవుతుంది. మొదట బ్యాటింగ్‌ చేసి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచితే మిగతా పనిని బౌలర్లు చూసుకుంటారు. ఎందుకంటే ఈ స్టేడియంలో పిచ్‌ మొదట బ్యాటింగ్‌కు ఎంతగా సహకరిస్తుందో, సెకెండాఫ్‌లో పేస్‌ బౌలింగ్‌కు అంతగానే అనుకూలిస్తుంది. ఈ విషయం కూడా మన టీమ్ కు బాగా తెలిసినదే. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కానీ దీన్ని ఛేధించే క్రమంలో భారత పేసర్లు షమీ (5/18), సిరాజ్‌ (3/16), బుమ్రా (1/8) రెచ్చిపోయి లంకేయులను 55 పరుగులకే కుప్పకూల్చారు.

ఇక వాంఖడే మైదానంలో 21 మ్యాచ్‌లాడిన భారత్‌.. 12 విజయాలు నమోదు చేసింది.  9 మ్యాచ్‌ల్లో ఓడింది.

తుది జట్లు:

భారత్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్‌:

డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Summer Tips: సమ్మర్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్

వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

New Update
summer tips

summer tips

Summer Tips: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.  అందుకే ఈ కాలంలో సరైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి.

సరైన జీవనశైలి అలవాట్లు

  • వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. రోజుకు కనీసం 3–4 లీటర్లు నీళ్లు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు, తాటిపండు, దోసకాయ వంటి తండ్రీ ఆహార పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. 
  • బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తెలుపు లేదా లేత రంగుల దుస్తులు ధరించడం మంచిది. టోపీలు, గ్లాసెస్ వంటివి వాడడం వలన ఎండ నుంచి రక్షణ లభిస్తుంది. సూర్యుడి కిరణాలు ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే అవసరమైన పనుల కోసం బయటకు వెళ్లడం ఉత్తమం. 
  • వేసవిలో ఆహారం మితంగా తీసుకోవడం, పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. వేసవిని సురక్షితంగా, ఆరోగ్యంగా గడపాలంటే ఈ మార్పులు అనుసరించడం అవసరం.

Summer Tips: శరీరంలో నీటి కొరత ఉంటే ఈ రోగాలు చుట్టుముడతాయి.. జాగ్రత్త!

 నిద్ర, విశ్రాంతి 

  • వేసవిలో వేడి ప్రభావం శరీర శక్తిని తగ్గిస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శరీరం  త్వరగా అలసిపోతుంది.  అలాంటి సమయంలో శరీరానికి తగిన విశ్రాంతి చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 7–8 గంటల నిద్ర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 
  • తీవ్ర మైన ఎండల  సమయంలో ఎయిర్ కండిషనర్ లేదా ఫ్యాన్ ఉపయోగించడం వల్ల నిద్రలో అంతరాయం కలగదు. మధ్యాహ్న సమయంలో 15–30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. 
  • వేసవిలో ఎక్కువ పని చేయడం వల్ల తలనొప్పులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాటిని నివారించాలంటే తగినంత నిద్ర చాలా అవసరం. 
  • శరీరం మానసికంగా, శారీరకంగా రిఫ్రెష్ అవ్వాలంటే విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. వేడి ప్రభావం తగ్గించడానికి గది శుభ్రంగా ఉంచడం,   ప్రాపర్ వెంటిలేషన్  ఉండేలా చూసుకోవాలి.  వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర,   విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకూడదు.

latest-news | telugu-news | summer-tips | life-style

Advertisment
Advertisment
Advertisment