T20 World Cup: ఇండియా, కెనడా మ్యాచ్ రద్దు టీ20 వరల్డ్‌కప్‌కు వర్షాలు గండంగా మారాయి. నిన్న యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్ రద్దయితే ఈరోజు భారత్, కెనడాల మధ్య మ్యాచ్. దీంతో ఈ రోజు మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. By Manogna alamuru 15 Jun 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి India Vs Canada: అమెరికాలోని ఫ్లోరిడాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మామూలుగా అయితే పర్వాలేదు కానీ వాటి కారణంగా టీ20 వరల్డ్‌కప్‌కు పెద్ద బాధగా తయారయింది. వర్షాల కారణంగా మ్యాచ్‌లు వరుసగా రద్దవుతున్నాయి. నిన్న ఐర్లాండ్, యూఎస్ఏ మధ్య మ్యాచ్ రద్దయితే...ఇవాళ టీమ్ ఇండియా, కెనడాల మధ్య మ్యాచ్ రద్దయింది. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ ముందుగానే తెలిపింది. అందుకు తగ్గట్టుగానే మ్యాచ్ జరిగే బ్రోవార్డ్ కౌంటీలో ఇవాళ భారీ వర్షం కురిసింది. దాంతో టాస్ కూడా పడకుండానే ఆట రద్దయింది. నిజానికి మ్యాచ్ మొదలయ్యే టైమ్‌కు వర్షం ఆగిపోయింది. కానీ ముందు పడిన వాన వలన పిచ్ అంతా తడిగా అయిపోయింది. అది ఆరుతుందేమో అని చాలాసేపు వెయిట్ చేశారు. కానీ ఎంతసేపు అయినా గ్రౌండ్ తడిగానే ఉంది. అంపైర్లు రెండు సార్లు మైదానాన్ని పరిశీలించారు. తరువాత ఇంక మ్యాచ్ ఆడలేమని తేల్చారు. దీంతో ఇరుజట్లకూ చెరో పాయింట్ కేటాయించారు. దీంతో గ్రూప్ దశను టీమ్ఇండియా ఏడు పాయింట్లు (3 విజయాలు, ఒక మ్యాచ్ రద్దు)తో ముగించింది. Also Read:UttaraKhand: ఉత్తరాఖండ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా-ప్రధాని మోదీ #cricket #india #canada #t20-world-cup #match మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి