/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T180056.437.jpg)
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై ఫైనల్స్‌లో అనర్హత వేటు పడ్డ సంగతి తెలిసిందే. 50 కేజీల విభాగంలో పోటీలో పాల్గొనేముందు ఆమె బరువును కొలవగా 100 గ్రాములు అధికంగా ఉండటంతో అధికారులు వినేష్‌ను డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో యావత్ భారత ప్రజలు షాక్‌కి గురవుతున్నారు. ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో కూడా వినేష్ ఫొగాట్ అంశంపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి.
#WATCH | Union Sports Minister Mansukh Mandaviya speaks on the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024
He says, "…Today her weight was found 50 kg 100 grams and she was disqualified. The Indian Olympic Association has lodged a strong… pic.twitter.com/7VkjoQQyIM
— ANI (@ANI) August 7, 2024
Also Read: వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు.. రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి
అనర్హత అంశంలో చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషాను ప్రధాని మోదీ ఆదేశించారని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. అయినప్పటికీ ఈ అంశంలో పూర్తి వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుపట్టాయి. అనంతరం నిరసనలు తెలుపుతూ లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. తర్వాత పార్లమెంటు బయట వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై న్యాయం చేయాలని కోరుతూ.. ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు.
#WATCH | Delhi | INDIA bloc MPs stage protest at Makar Dwar of Parliament seeking justice for wrestler Vinesh Phogat after disqualification from Paris Olympics pic.twitter.com/8qZ6GqjbeT
— ANI (@ANI) August 7, 2024
వినేష్ ఫొగాట్ అనర్హత వేటుపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. 'ఆమె బరువును చేక్ చేయాల్సిన పని కోచ్, ఫిజియోథెరపిస్టులదే. ఇంత పెద్ద స్థాయిలో కూడా పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు లక్షల్లో జీతం తీసుకుంటున్నారు. వారేమైనా సెలవుల కోసం అక్కడి వెళ్లారా' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
#WATCH | Punjab CM Bhagwant Mann meets Indian wrestler Vinesh Phogat's uncle Mahavir Phogat in Charkhi Dadri, Haryana
CM Mann says, "...such mistakes are happening on such a high level. Coaches and physiotherapists are paid in lakhs. Have they gone there for holidays?" pic.twitter.com/HssegHyHPU
— ANI (@ANI) August 7, 2024
Also Read: మరోసారి తెరపైకి రాజపక్స కుటుంబం.. ఈసారి ఎన్నికల్లో పోటీ