Asia games:ఆసియా క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణం చైనాలో జరుగుతున్న ఏషియా గేమ్స్ 2023లో భారత్ కు మొదటి స్వర్ణం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. By Manogna alamuru 25 Sep 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఆసియా క్రీడలు 2023లో ఇండియా బోనీ కొట్టింది. టీమ్ ఈవెంట్ లో తన మొదటి స్వర్ణాన్ని నమోదు చేసుకుంది.పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో పతకం వచ్చింది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ సన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ లతో కూడిన భారత జట్టు తొలి బంగారు పతకాన్ని ఇండియాకు అందించింది. క్వాలిఫికేషన్ ఫైనల్ రౌండ్ లో 1893.7 స్కోర్ తో టీమ్ ఇండియా టాప్ లో నిలిచింది. దీంతో భారత్ ప్రపంచ రికార్డ్ను నెలకొల్పొంది. అంతకు ముందు చైనా చేసిన 1893.3 పాయింట్ల రాకర్డ్ ను ఇండియా ఇప్పుడు బద్దలు కొట్టింది. ఇండోనేషియా సిల్వర్ మెడల్, చైనా కాంస్య పతకాలను దక్కించుకున్నాయి. అంతకు ముందు ఆసియా క్రీడలు ఆరంభం రోజునే భారత్ ఖాతాలో మూడు పతాకాలు చేరాయి. మొదటి ఈవెంట్ లోనే పతకాన్ని సాధించి గొప్ప ఆరంభాన్ని అందించారు భారత క్రీడాకారులు. పది మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో రమిత, మెహులి ఘోష్, అశి చౌక్సే అద్భుత ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సాధించారు. గ్రూప్ విభాగంలో మెడల్ సాధించడంతోపాటు రమిత, మెహులి వ్యక్తి విభాగంలో ఫైనల్ చేరుకున్నారు.ఇక భారత ఆర్మీకి చెందిన అర్జున్ లాల్ జాట్, అర్వింద్ కలిసి పురుషుల రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్ విభాగంలో సిల్వర్ సాధించారు. రోయింగ్ విభాగంలోనే బాబులాల్ యాదవ్, లేఖ్ రామ్ జోడి కాంస్యం సాధించింది. 8మందితో కూడిన టీమ్ మరో సిల్వర్ కూడా భారత్ ఖాతాలో చేరింది. ప్రస్తుతం టీమ్ ఇండియా ఖాతాలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. ఆసియా క్రీడలు 2023 సెప్టెంబరు 23న మొదలయ్యాయి. ఇవి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్నాయి. 19వ ఆసియా క్రీడల ప్రారంభ వేడుక సెప్టెంబర్ 23న హాంగ్‌జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియంలో జరిగింది. ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్ జెండా బేరర్లుగా వ్యవహరించారు. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 655 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆసియా క్రీడల చరిత్రలో ఈసారి భారత్ నుంచి అత్యధికంగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. #gold #bharat #china #india #games #first #2023 #team #hangzhou #asia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి