PM Modi: ప్రతిఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

దసరా పండుగ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతి చెడు అంశంపై దేశభక్తి సాధించిన విజయానికి ప్రతీకే దసరా పండుగ అని తెలిపారు. సమాజంలో కులతత్వం, ప్రాంతీయతత్వాన్ని రూపుమాపాలన్నారు.చంద్రయాన్-3 సక్సెస్ కావడం, కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించడం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం వంటి శుభపరిణామాల మధ్య ఈరోజు దసరా పండుగను జరుపుకుంటున్నామని ప్రధాని అన్నారు. అలాగే ప్రతిఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయండని పిలుపునిచ్చారు.

New Update
PM Modi: ప్రతిఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రావణ్ దహన్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీలోని ద్వారకా సెక్టార్-10లో రామ్‌లీలా మైదానంలో నిర్వహంచిన రావణ్ దహన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతి చెడు అంశంపై దేశభక్తి సాధించిన విజయానికి ప్రతీకే దసరా పండుగ అని అన్నారు. సమాజంలో కులతత్వం, ప్రాంతీయతత్వాన్ని రూపుమాపాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. శతాబ్దాల పాటు ఎదురుచూసిన తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడం ప్రతిఒక్కరికీ కలిగిన అదృష్టమని పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లోనే రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని.. ఈ ఆలయం ప్రజల సహనం సాధించిన విజయానికి గుర్తుగా నిలుస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్-3 సక్సెస్ కావడం, కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించడం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం వంటి శుభపరిణామాల మధ్య ఈరోజు దసరా పండుగను జరుపుకుంటున్నామని ప్రధాని అన్నారు.

Also read: మణిపూర్ హింసకాండలో వాళ్ల ప్రమేయమే ఉందా: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..

దసరా పండుగ రోజున అందరూ భక్తి శ్రద్ధలతో ఆయుధ పూజలు చేస్తారని.. ఆత్మరక్షణ కొరకే భారత్ ఆయుధాలు వాడుతోందని తెలిపారు. ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించడం మా విధానం కాదని.. విశ్వమానవ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ విజయదశమి రోజున శక్తి పూజ చేస్తామని పేర్కొన్నారు. అలాగే.. ఒక్క పేద కుటంబం సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరడంతో సహా ప్రతిఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయండని ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. . నీరు ఆదా చేయడం, డిజిటల్ లావాదేవీలు, వోకల్ ఫర్ లోకల్, పనిలో నాణ్యత, దేశీయ పర్యాటకం, ప్రకృతి వ్యవసాయం, స్వచ్ఛత, చిరుధాన్యాల వినియోగం, ఫిట్‌నేస్ అంశాలను ప్రోత్సహించాలని అభ్యర్థించారు. అందరూ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి అవుతుందని పేర్కొన్నారు.

Also Read: టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి శ్రీలంకకు వెళ్లాలంటే వీసా అవసరం లేదు..

Advertisment
Advertisment
తాజా కథనాలు