Weather Alert: రాగల రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

రాగల రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

New Update
Rains: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్..!

రాగల రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బంగాళఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడి ఆ తర్వాత ఇది తుపానుగా రూపాంతరం చెందిందని పేర్కొంది. ఈ నెల 25న బెంగాల్, ఒడిశా మధ్య తీరాన్ని తుపాను తాకనుందని.. 26న తీవ్ర తుపానుగా మారుతూ బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని తెలిపింది.

Also Read: నగరం నడి రోడ్లపై నీటి కుంటలు.. మహిళ వినూత్న నిరసన!

మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఈ ఏడాది మూడురోజుల ముందుగానే రుతుపవనాలు రానున్నాయి. ఈ నెల 29న కేరళకు రుతుపవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక జూన్ మొదటి వారంలో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని.. ఆ తర్వాత జులై నాటికి దేశంలో విస్తరించనున్నాయని వెల్లడించింది.

Also read: రేవ్‌ పార్టీ సూత్రధారి తెలుగువాడే.. దోసెలమ్మి రూ.కోట్లకు ఎదిగి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు