Walking Tips: ఇలా నడవద్దు.. చాలా మంది వాకింగ్‌లో చేసే తప్పులు ఇవే!

వాకింగ్‌ ఈజ్‌ వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ ఎక్సర్‌సైజ్‌. అందులో మరో ఆలోచనలేదు. అయితే చాలా మంది నడిచేటప్పుడు చేతులను నిశ్చలంగా ఉంచుతారు. అలా చేయవద్దు. వాకింగ్‌ అప్పుడు శరీర భంగిమ వెనుకకు లేదా ముందుకు వంగకూడదు. మీ ఛాతీ బయటకు ఉండాలి.

New Update
Walking Tips: ఇలా నడవద్దు.. చాలా మంది వాకింగ్‌లో చేసే తప్పులు ఇవే!

Walking Tips: : ప్రస్తుత కాలంలో నడక అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా చేయగలిగే వ్యాయామం. ఇందులో.. శరీరంలోని ప్రతి భాగం కార్డియో వర్కౌట్‌లో జరిగే విధంగా పని చేస్తుంది. కానీ.. నడక సమయంలో కొన్ని తప్పులు చేస్తారు. ఈ తప్పులు చేస్తే మీ కృషిని పాడు చేస్తాయని నిపుణులు అంటున్నారు. రోజుకు కేవలం 30 నిమిషాలు నడిస్తే.. రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకావు గుండెపోటుతో సహా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ఎముకలు దృఢంగా ఉంటాయి. అయితే నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చేయి కదలకపోవడం

  • నడుస్తున్నప్పుడు చేతులు కదలడం సహజమే. కానీ.. కొందరు వాటిని పూర్తిగా నిశ్చలంగా ఉంచుతారు. ఈ పొరపాటు నడక వల్ల కలిగే ప్రయోజనాలను తగ్గిస్తుంది. మీరు ఇలా చేస్తే ఏరోబిక్ వ్యాయామం యొక్క ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.ఇలా చేస్తే కాళ్ళ, చేతులు, పెద్ద కండరాల సమూహాలు కలిసి పనిచేసి రక్త ప్రసరణ , హృదయ స్పందన రేటును మెరుగుపరుగుపడుతుంది.
  • నడుస్తున్నప్పుడు మీ భంగిమ ఖచ్చితంగా ఉండాలి. శరీరం వెనుకకు లేదా ముందుకు వంగకూడదు. మీ ఛాతీ బయటకు ఉండాలి. కళ్ళు ముందు వైపు ఉండాలి. దీనితో శరీరాన్ని బిగుతుగా సాధారణంగా ఉంచుకోకండి.

నీరు త్రాగుట

  • నడకకు ముందు లేదా తర్వాత చల్లటి నీటిని తాగితే..వేడి, జలుబును కలిగిస్తుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రత పూర్తిగా పడిపోతుంది. మీరు ముందే నీరు త్రాగినట్లయితే..కనీసం 20 నిమిషాల తర్వాత వ్యాయామం చేయాలి. నీరు తాగిన తర్వాత పరిగెడితే కడుపు నొప్పి వస్తుంది.

విశ్రాంతి

  • ప్రతి వ్యాయామంలాగే.. నడక తర్వాత శరీరానికి విశ్రాంతి ముఖ్యం. తద్వారా శరీరం స్వయంగా కోలుకుంటుంది. తగినంత విశ్రాంతి లేదా నిద్ర లేకపోతే..శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది.

వేగాన్ని తగ్గించాలి

  • నడుస్తున్నప్పుడు శరీరం కదలికపై శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే.. చాలా నెమ్మదిగా, చాలా వేగంగా నడవడం వల్ల ప్రయోజనాలను తగ్గించుకోవచ్చు. మీ వేగం మీరు అలసిపోకుండా ఎక్కువసేపు నడవగలిగేలా ఉండాలి.

ఇది కూడా చదవండి: ఈ చలికాలంలో పెద్దలకు ఇవే అతిపెద్ద శత్రువులు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు