World cup 2023: పాకిస్థాన్ క్రికెట్‌లో భూకంపం.. ఇంజమామ్ సంచలన నిర్ణయం! పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్ పదవికి ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేశారు. ఇంజమామ్‌పై పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఇప్పటికే ఉండగా.. మరోవైపు వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ వరుసపెట్టి ఓడిపోతోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన పాక్.. కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది. అటు బాబర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. By Trinath 30 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి సంచలనాలకు, కుదుపులకు మారుపేరైన పాకిస్థాన్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నిన్నటివరకు పాక్ చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశాడు. ఓవైపు వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు ఫెయిల్యూర్స్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న వేళ.. ఇంజమామ్ తీసుకున్న నిర్ణయం అందరిని షాక్‌కి గురి చేసింది. మరోవైపు కెప్టెన్ బాబర్ అజామ్‌పై కూడా తీవ్రంగా మండిపడుతున్నారు మాజీ క్రికెటర్లు. బాబర్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఓవైపు డిమాండ్ పెరుగుతుండగా.. ఇదే సమయంలో ఇంజమామ్ తన పదవికి రిజైన్ చేశాడు. ఇంజమామ్ రాజీనామా విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు కూడా కన్ఫామ్ చేసింది. BIG BREAKING NEWS - Inzamam-ul-Haq resigns from role of Pakistan chief selector amid team's poor run in BHARAT 🔥🔥 It's shocking & funny that Inzamam-ul-Haq resigns midway through World Cup 2023 😂 Radical Inzamam is also involved in the contract scam and his potential… pic.twitter.com/mIUK32nS0j — Times Algebra (@TimesAlgebraIND) October 30, 2023 అసలేం జరిగింది? మన ఇండియన్ క్రికెట్‌లో రూల్స్ ఉన్నట్లే పాకిస్థాన్‌లోనూ ఓ రూల్ ఉంది. కీలక పదవుల్లో ఉన్నవాళ్లకి పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉండకూడదు. ఇంజమామ్ కొంపమునడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. కొంతమంది పాక్ క్రికెటర్లకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కంపెనీలో ఇంజమామ్ భాగస్వామిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తల్హా రెహ్మాన్ కంపెనీతో ప్రస్తుత జట్టులోని కీలక ఆటగాళ్లతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లకు ఈ కంపెనీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ లిస్ట్‌లో బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్, షాహిన్ షా అఫ్రిది లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇతర కార్యక్రమాలను ఈ కంపెనీనే పర్యవేక్షిస్తోంది. ఇందులోనే ఇంజమామ్ పార్టనెర్‌గా ఉన్నట్లు సమాచారం. ఇలా ఉండడం తప్పు. ఎందుకంటే ఇంజమామ్ చీఫ్ సెలక్టర్ పొజిషన్‌లో ఉన్నాడు. కంపెనీలోని ప్లేయర్లు జట్టులో ఉంటే అతనికి కంపెనీ పరంగా లాభాలు వస్తాయి. Pakistan chief selector Inzamam Ul Haq has resigned from his position after a humiliating performance in World Cup 2023.#PCB #CWC23 #Inzamamulhaq pic.twitter.com/ptPIF03AE4 — Raj (@TheLicit_) October 30, 2023 నెక్ట్స్ ఏం జరగబోతోంది? ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఆట తీసికట్టుగా ఉంది. టోర్నీని రెండు విజయాలతో ఆరంభించిన పాకిస్థాన్ ఆ తర్వాత నుంచి ఘోరంగా ఆడుతోంది. అక్టోబర్ 14న ఇండియాతో ఓడిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మరో విక్టరీ లేదు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. పసికూన అఫ్ఘాన్‌పైనా ఓడిపోయింది. వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు సెమీస్ చేరుతుందని అంతా భావించగా.. ఇప్పుడు మాత్రం సెమీస్ అవకాశాలను చాలా కష్టం చేసుకుంది. దీంతో మాజీ క్రికెటర్లు కెప్టెన్ బాబర్ అజామ్ టార్గెట్‌గా ఫైర్ అవుతున్నారు. అతను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని షోయబ్ మాలీక్ లాంటి ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. పాక్ మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్ బాబర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఇదే సమయంలో ఇంజమామ్ తప్పుకోవడంతో నెక్ట్స్ వికెట్ బాబరేనన్న అనుమానాలు నెలకొన్నాయి. Also Read: అఫ్ఘాన్ స్టార్ రషీద్‌ఖాన్‌కు రూ.10 కోట్లు ఇచ్చిన రతన్ టాటా..! #cricket #pakistan #babar-azam #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి