World Cup 2023: షమీ, కోహ్లీ, రోహిత్, బుమ్రా.. వీరిలో ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌కప్ ఎవరికి ? ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌కప్ రేస్‌లో తొమ్మిది మంది ప్లేయర్లు ఉండగా.. అందులో భారత్ నుంచి రోహిత్, కోహ్లీ, బుమ్రా, షమీ ఉన్నారు. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ ఇప్పటికే 700కు పైగా రన్స్ చేయగా.. అటు షమీ 6 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. By Trinath 18 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి నవంబర్ 19న జరగనున్న వరల్డ్‌కప్‌లో ఫైనల్‌లో ఎవరు గెలుస్తారన్నదానిపై ఎవరి లెక్కలు వారికున్నాయి. ఎక్కువమంది ఇండియానే గెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌కు అసలు ఓటమే లేదు. 2003 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఓటమే లేదు. అప్పుడు ఆస్ట్రేలియానే గెలిచింది. ఇప్పుడు ఇండియానే గెలుస్తుందని. నాడు ఆస్ట్రేలియా టీమ్ ఎంత బలంగా ఉందో ఇప్పుడు రోహిత్ సేన అంతే బలంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా గతంతో పోల్చితే పెద్ద స్ట్రాంగ్ టీమ్ కాదని చెబుతున్నారు. అయితే వరల్డ్‌కప్ లాంటి టోర్నిల్లో ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయకూడదు. మరోవైపు ఈ వరల్డ్‌కప్(World Cup)లో వ్యక్తగతంగా పలువురు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారిలో ఎవరికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. Virat Kohli 85(116) vs Australia CWC 2023 ( Ball by Ball Highlights )#ViratKohli𓃵 #INDvsAUS pic.twitter.com/TUnA72Jqac — Kohlisexual 🇮🇳 (@Kohlisexual0511) November 18, 2023 9 మంది మధ్య పోటి: ఈ ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించిన తొమ్మిది మంది ప్లేయర్లలో భారత్ నుంచి నలుగురు ఉన్నారు. ఈ లిస్ట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ఉండగా.. మిగిలిన ఐదుగురు ప్లేయర్లు విదేశీ ఆటగాళ్లు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా, దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డి కాక్, కివీస్‌బ్యాటర్ రచిన్ రవీంద్ర, ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మాక్స్‌వెల్, న్యూజిలాండ్ వీరుడు డారిల్ మిచెల్ ఈ లిస్ట్‌లో ఉన్నారు. షమీ, కోహ్లీలలో ఒకరికి ఛాన్స్? పోటీల్లో 9మంది ఉన్నా.. చాలా మంది అభిప్రాయం మాత్రం షమీ లేదా కోహ్లీలో ఒకరికి ఈ అవార్డు వస్తుందని చెబుతున్నారు. కోహ్లీ ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ 711 రన్స్ చేశాడు. ఇంకా ఫైనల్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లోనూ కోహ్లీ సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు ఈ వరల్డ్‌కప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా షమీ ఉన్నాడు. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. అది కూడా బ్యాటింగ్ పిచ్‌లపై షమీ ఇరగదీయ్యడంతో షమీకే ఈ అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. అటు ఆస్ట్రేలియా స్పిన్నర్ జంపా 22 వికెట్లు తీసి షమీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. అటు ఈ వరల్డ్‌కప్‌లో మ్యాక్స్‌వెల్ 398 రన్స్‌తో పాటు 5 వికెట్లు తీశాడు. Also Read: నాడు మ్యాచ్ ఫీజ్ రూ.1,500.. ఇప్పుడెన్ని లక్షలో తెలుసా? WATCH: #virat-kohli #rohit-sharma #mohammed-shami #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి