IND VS AUS: మోదీ గడ్డపై తొడగొట్టేదేవరు..? ఫైనల్ ఫైట్‌కు సిద్ధమైన రోహిత్ టీమ్ వరల్డ్‌కప్ ఫైనల్ ఫైట్‌కు సమయం దగ్గర పడింది. మధ్యాహ్నం 2గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు 13సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 8సార్లు, ఇండియా 5సార్లు గెలిచాయి. ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారే దానిపై ఉత్కంఠ నెలకొంది. By Trinath 19 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ICC WORLD CUP 2023: మాధ్యాహ్నం రెండు గంటలెప్పుడవుతుందా అని యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్ ఫైట్ కోసం ఇరు జట్ల అభిమానులే కాదు.. క్రికెట్ క్రీడా లోకం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోంది. ఆదివారం కావడంతో చాలామందికి హాలీడేనే ఉంటుంది. పిల్లలతో, తల్లిదండ్రులతో, ఫ్రెండ్స్‌తో.. ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా ప్లాన్ గీసుకున్నారు. బిర్యానీలు ఆర్డర్లు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్లును చెక్ చేసుకుంటున్నారు. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా లక్షా 30వేలమంది వీక్షించనుండగా.. ఇక టీవీల్లో ఎంతమంది చూస్తారన్నది మ్యాచ్ ముగిసే వరకు చెప్పలేం. ఫేవరట్‌గా ఇండియా: 2003నాటి ఇండియా వేరు.. ఇప్పటి ఇండియన్ టీమ్ వేరు.. నాటి ఆస్ట్రేలియన్ టీమ్ వేరు.. ఇప్పటి ఆస్ట్రేలియన్ టీమ్ వేరు.. అప్పుడు ఇండియా ఒకరిద్దరి ఆటపై ఆధారపడిన జట్టు.. ఇప్పుడు జట్టులో ప్రతీఒక్కరూ తమ పాత్ర పోషిస్తున్నారు. అటు ఆస్ట్రేలియా టీమ్ మునపటిలా స్ట్రాంగ్ కాదు.. అయినా పోరాడేతత్వం వారి నైజం. చివరి వరకు ఓటమిని అంగీకరించని జట్టు అది. ఓటమి ఎదురే ఉన్న తలవంచని ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేస్తే అది మొదటికి మోసం వస్తుంది.. అందుకే ఈ మ్యాచ్‌లో ఇండియా ఎలాంటి అలసత్వానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇటు విశ్లేషకులు మాత్రం ఇండియానే గెలుస్తుందంటున్నారు. ఆ విషయంలో ఆస్ట్రేలియాదే పైచేయి: ఇప్పటివరకు ఈ రెండు జట్లలో వరల్డ్‌కప్‌ల్లో 13సార్లు తలపడ్డాయి. అందులో 8సార్లు ఆస్ట్రేలియా గెలవగా.. 5సార్లు ఇండియా గెలిచింది. ఇదే వరల్డ్‌కప్ గ్రూప్‌స్టేజీలో ఆస్ట్రేలియాను ఓడించింది ఇండియా. రాహుల్, కోహ్లీ బ్యాటింగ్‌లో సత్తా చాటడంతో గెలిచింది. ఇక 2019 వరల్డ్‌కప్ గ్రూప్ స్టేజీలోనూ భారత్ గెలిచింది. 2015 సెమీస్‌లో భారత్ ఓడిపోయింది. ఇక 2011 క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను ఇంటికి పంపింది ఇండియా. ఇక 2003లో గ్రూప్‌లో జరిగిన మ్యాచ్‌తో పాటు ఫైనల్‌లోనూ ఆస్ట్రేలియాపై ఇండియా ఓడిన విషయం తెలిసిందే. ఇక 1999,1996,1992 వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లోనూ ఇండియా ఓడిపోయింది. 1987 వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. ఒక మ్యాచ్‌లో ఇండియా.. ఇంకో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచాయి. 1983లోనూ అంతే. ఓవరాల్‌గా ఇండియాపై ఆస్ట్రేలియాదే పైచేయి.. అయితే చివరి నాలుగు ఎన్‌కౌంటర్లలో మాత్రం ఇండియా మూడు సార్లు గెలిచింది. ఇక ప్రస్తుతం అదిరిపోయే ఫామ్‌లో ఉండడంతో టీమిండియానే ఫేవరట్‌గా బరిలోకి దిగుతోంది. Also Read: వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ గెలిస్తే రూ.100 కోట్లు పంచుతా.. ఎవరన్నారంటే.. WATCH: #virat-kohli #rohit-sharma #cricket #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి