/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pamela-jpg.webp)
Pamela Son : చాలా మంది విద్యార్థులు , పెద్దవారు ఎప్పుడెప్పుడు వేసవి కాలం సెలవులు(Summer Holidays) వస్తాయా.. ఎప్పుడెప్పుడు ఇంట్లో హాయిగా ఆడుకుంటు ఉందామా అని అనుకుంటారు. కానీ పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండ.. ఇంటి దగ్గర ఉంటే వారు చేసే అల్లరి ఎలా ఉంటుందో ఆ తల్లులకు మాత్రమే తెలుస్తుంది. వారం మొత్తంలో ఒక్క రోజు స్కూల్ కు సెలవు వస్తేనే ఇల్లు పీకి పందిరి వేస్తారు. ఇక ఉద్యోగాలు చేసే తల్లుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తాజాగా సోషల్ మీడియా(Social Media) లో ఓ వీడియో వైరల్ అవుతుంది... ఆ వీడియోలో ఓ ఐఏఎస్ అధికారిణి(IAS Officer) కొడుకు ఆమె పని చేసుకుంటూ ఉండగా.. ఆమె కొడుకు డెస్క్ మీదకి ఎక్కి ఆడుకుంటున్నాడు. ఈ వీడియోలో బాబు ఆడుకుంటుండగా... వెనుక ఆమె పని చేసుకుంటు కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ వీడియో ఎవరిదీ అనుకుంటున్నారా.. పమేలా సత్పతి(Pamela Sathpaty) అనే ఐఏఎస్ అధికారిణిది . ఆమె ఈ వీడియోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
The most awaited time of the year has now become the most dreaded time of the year.
SUMMER VACATION 🤕🤒POV: You are a Boy Mum🥹#parenting #vacations pic.twitter.com/Fi8UIcimKN
— Pamela Satpathy (@PamelaSatpathy) April 11, 2024
అందులో ఆమె కుమారుడు ఆమె డెస్క్ మీదకు ఎక్కి..సూపర్ మ్యాన్ లా డైలాగులు చెబుతూ అల్లరి చేస్తుండగా.. ఆ వెనుక ఆమె సీట్లో కూర్చొని పని చేసుకుంటున్నారు. ఈ వీడియోను పమేలా షేర్ చేస్తూ...'"సంవత్సరంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమయం ఇప్పుడు సంవత్సరంలో అత్యంత భయంకరమైన సమయంగా మారింది. వేసవి సెలవులు. POV : మీరు ఒక అబ్బాయి తల్లి" అని రాశారు.
ఈ వీడియోను చూసిన వారంతా కూడా ఉద్యోగులు అయిన తల్లిదండ్రులు సెలవుల్లో ఎదుర్కొనే అతి ముఖ్యమైన సవాల్ ఇది అంటూ కామెంట్లు పెడుతున్నారు. తన కొడుకు పట్ల తనకున్న ప్రేమను చూపుతూనే పమేలా తన ఉద్యోగ బాధ్యతలను కూడా నిర్వహిస్తుండడం నిజంగా గొప్ప విషయమని పేర్కొంటున్నారు. "సూపర్-బాయ్ ఆఫ్ ఎ సూపర్-మామ్" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో ని ఇప్పటి వరకు లక్ష మందికి పైగా వీక్షించారు.
Also read: భారతీయులా మజాకానా.. దెబ్బకి దిగి వచ్చిన మాల్దీవులు!