india-canada fight:భారత్ తో సన్నిహిత సంబంధాలు కావాలి కానీ...

అవ్వా కావాలి...బువ్వ కావాలి అన్నట్టున్నాయి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలు. భారత్ తో సన్నహిత సంబంధాలకు కట్టుబడి ఉంటామని చెబుతూనే నిజ్జర్ హత్యోదంతాన్ని మాత్రం వదిలేదని హింట్ ఇస్తున్నారు. మరోవైపు అమెరికా కూడా మావైపే ఉందంటూ ప్రకటిస్తున్నారు.

New Update
india-canada fight:భారత్ తో సన్నిహిత సంబంధాలు కావాలి కానీ...

మాంట్రియల్ లో జరిగిన ఓ సమావేశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నిజ్జర్ హత్య విషయంలో తీవ్ర ఆరోపణలుచేసిన ట్రుడో ఒక్కసారి స్వరం మార్చినట్టు అనిపించింది. గ్లోబల్ స్థాయిలో ఇండియాకు పెరుగుతున్న ప్రధాన్యత చూస్తున్నాం. ఇలాంటి టైమ్ తో భారత్, కెనడా మధ్య సంబంధాలు పటిష్టంగానే ఉండాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు ట్రుడో. కిందటి ఏడాది కెనడా ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని అందించింది. దానికి తాము ఇప్పటికీ కట్టుబడే ఉన్నామని అంటున్నారు కెనడా ప్రధాని. భారత దేశం అభివృద్ధి చెందుతున్న ఆర్ధికశక్తి అని కొనియాడారు.

ఇంత చెప్పారు బాగానే ఉంది...ఆరోపనల విషయంలో కూడా తగ్గుతారేమో అనుకునేలోపే తన స్వరం మార్చారు కెనడా ప్రధాని ట్రుడో. కాసేపటికే నిజ్జర్ హత్యోదంతాన్ని హైలేట్ చేస్తూ మాట్లాడారు. నిజ్జర్ హత్యను ప్రజాస్వామ్యం, చట్టాలను అనుసరించే దేశాలు తీవ్రంగా పరిగనించాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో అమెరికలన్లు తమతోనే ఉన్నారంటూ ప్రకటించారు కూడా. నిజ్జర్ మర్డర్ విషయంలో భారత్ మాతో పనిచేసి వాస్తవాలను బయటికి తీయడంలో సహకరించాలి అన్నారు. భారత విదేశాంగ మంత్రితో భేటీ టైమ్ లో ఆ విషయం మాట్లాడతానని అమెరికా మంత్రి ఆంటోని బ్లింకెన్ మాటిచ్చారని ట్రుడో చెప్పారు.

పాపం అతను అనుకున్నది అవ్వలేదుగా...

అమెరికాతో మాతోనే ఉంది కెనడా ప్రధాని ట్రుడో చెప్పారు కానీ అమెరికా అదేమీ పట్టించుకున్నట్టు లేదు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాలు కెనడా ఊసు కూడా ఎత్తలేదని తెలుస్తోంది. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కూడా నిజ్జర్ పేరు ప్రస్తావించేందుకు కూడా బ్లింకెన్ ఇష్టపడలేదు.

india, us meet

Advertisment
Advertisment
తాజా కథనాలు