Axar Patel: ఆ వార్త వినగానే నా కాళ్లు చేతులు ఆడలేదు.. పంత్ యాక్సిడెంట్ పై అక్షర్ ఎమోషనల్

సహచర ఆటగాడు రిషభ్‌ పంత్ రోడ్డు యాక్సిడెంట్ వార్త తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని అక్షర్ పటేల్ చెప్పారు. నా సోదరి విషయం చెప్పగానే షాక్‌ అయ్యాను. ఒక్కసారిగా నన్ను భయం ఆవరించింది. పంత్‌కు ఏదో జరిగిపోయిందని భావించి కాళ్లు, చేతులు ఆడలేదంటూ ఎమోషనల్ అయ్యాడు.

New Update
Axar Patel: ఆ వార్త వినగానే నా కాళ్లు చేతులు ఆడలేదు.. పంత్ యాక్సిడెంట్ పై అక్షర్ ఎమోషనల్

Axar Patel: భారత స్టార్‌ ఆటగాడు రిషభ్‌ పంత్ రోడ్డు యాక్సిడెంట్ వార్త (Rishabh Pant Accident News) తనను భయాందోళనకు గురిచేసిందని యంగ్ ప్లేయ్ అక్షర్ పటేల్  చెప్పారు. ఆ ఊహించని ఘోరంతో ఒక్కసారిగా తనలో భయం అవరించిందని, పంత్‌కు ఏదో జరిగిపోయిందనే ఆందోళనతో కాళ్లు, చేతులు ఆడలేదన్నాడు. అయితే అక్షర్ సంభాషణకు సంబంధించిన ఓ వీడియోను ఢిల్లీ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట చేయగా వైరల్ అవుతోంది.

ఈ మేరకు అక్షర్ (Axar Patel) మాట్లాడుతూ.. ‘ఆ రోజు ఉదయం 7 గంటలకు మా సోదరి నుంచి ఫోన్‌ కాల్ వచ్చింది. పంత్‌తో నువ్వు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడావు? అని అడిగింది. ముందు రోజే మాట్లాడాలని అనుకున్నాను.. కానీ కుదరలేదని చెప్పాను. వెంటనే పంత్‌ అమ్మగారి ఫోన్‌ నంబర్‌ కావాలని, నన్ను పంపించమని కోరింది. ఎందుకు అని అడిగితే.. పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపింది. ఆ మాట వినగానే నేను షాక్‌ అయ్యాను. ఒక్కసారిగా నన్ను భయం ఆవరించింది. పంత్‌కు ఏదో జరిగిపోయిందని భావించి కాళ్లు, చేతులు ఆడలేదు’ అంటూ అక్షర్‌ పటేల్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఆ సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : Rohith : పిచ్ గురించి తెలిస్తేనే మాట్లాడండి.. టెస్ట్ ఓటమి విమర్శలపై రోహిత్ ఫైర్

ఇదిలావుంటే.. రిషబ్ పంత్‌ మోకాలికి ఇటీవలే శస్త్రచికిత్స చేశారు వైద్యులు. దీంతో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటికప్పుడూ తన అభిమానులకు హెల్త్ అప్ డేట్ ఇస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ షేర్‌ చేసిన వీడియోపై ఢిల్లీ మెంటార్‌ సౌరభ్‌ గంగూలీ, కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా పంత్‌ ఆరోగ్యపరిస్థితిపై స్పందించడం విశేషం. కాగా ఐపీఎల్‌ (IPL) వేలం సందర్భంగా రిషభ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తరఫున దుబాయ్‌ వచ్చిన విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Realme 14T 5G: రియల్‌మి నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. సేల్ షురూ - ధర, ఆఫర్ల వివరాలివే!

రియల్‌మి కొత్త ఫోన్ లాంచ్ అయింది. కంపెనీ ఇటీవల 14టి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇవాళ దాని సేల్ ప్రారంభం అయింది. మొదటి సేల్‌లో రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్, రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుక్కోవచ్చు.

New Update
Realme 14T 5G launched

Realme 14T 5G launched

ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మీ భారత మార్కెట్లో మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది.  Realme 14T 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 6,000mAh బ్యాటరీతో వచ్చింది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇప్పుడు ఈ Realme 14T 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం. 

Realme 14T 5G Price

Realme 14T 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. అలాగే 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సర్ఫ్ గ్రీన్, లైటింగ్ పర్పుల్, అబ్సిడియన్ బ్లాక్ కలర్‌లలో లభిస్తుంది. లాంచ్ ఆఫర్‌‌లో భాగంగా.. కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో కొనుగోలు పై ఫ్లాట్ రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందుతారు. అదే సమయంలో రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మొదటి సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. దీనిని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుక్కోవచ్చు. 

Realme 14T 5G Specifications

Realme 14T 5G స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits హై బ్రైట్‌నెస్, 2000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. సేఫ్టీ కోసం ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఇచ్చారు. దీనిలో RAMని వర్చువల్ RAMతో 10GB వరకు విస్తరించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6పై పనిచేస్తుంది. అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 

14T 5G ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV50D40 ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. వీడియో కాలింగ్, సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ సోనీ IMX480 ఫ్రంట్ కెమెరా ఉంది. వీటితో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్, డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్, హైబ్రిడ్ మైక్రో SD స్లాట్ ఉన్నాయి. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లు అందించారు.

tech-news | telugu tech news | tech-news-telugu

Advertisment
Advertisment
Advertisment