Movies : నాకింకా 30 ఏళ్ళే.. మళ్ళీ పెళ్ళి చేసుకుంటా - నీహారిక ఎవరైనా జీవితాంతం కలిసి ఉండాలనే పెళ్ళి చేసుకుంటారు. విడిపోతామని తెలిస్తే అంత ఖర్చు పెట్టి చేసుకోరు. విడాకుల తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా బతకడం ఎలానో నేర్చుకున్నాను అని చెబుతున్న మెగాడాటర్ నీహారిక...మళ్ళీ పెళ్ళి చేసుకుంటానని తెలిపింది. తనకి ఇంకా 30 ఏళ్ళే అని కూడా చెబుతోంది. By Manogna alamuru 26 Jan 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Niharika Konidela : రెండేళ్ళకే విడాకులు తీసుకుంది మెగా డాటర్ నీహారిక(Niharika). చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda), నీహారికకు 2020లో పెళ్ళయింది. అయితే రెండేళ్ళలోనే ఇద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ ఎక్కడా దాని మీద స్పందించలేదు. డివోర్స్కు కారణాలు ఏంటో చెప్పలేదు. కానీ ఇప్పుడు మొదటిసారిగా తన పెళ్ళి, విడాకుల మీద మాట్లాడింది నిహారిక. పెళ్లి చేసుకునే ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. అది తెలియకుండా మనకు సెట్ అవ్వని వ్యక్తి మీద ఆధారపడకూడదు. వాళ్లు మన ఇంట్లో అమ్మ-నాన్నలా చూసుకోరు కదా. అంత ప్రేమ చూపించలేరు కూడా అంటూ చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత ఎవరి మీదా ఆధారపడకుండా ఒంటరిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను అంటోంది. Also read:Republic Day celebrations:40 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన సంప్రదాయం..గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి పెళ్ళి తర్వాత నటనకు దూరం... పెళ్ళవ్వడం వల్లనే నేను సినిమాల్లో నటించడం మానేసానని అందరూ అనుకుంటున్నారు. కానీ దానికి అది కారణం కాదు... నిర్మాతగా బిజీ అవ్వడం వల్లనే నటనకు గ్యాప్ ఇచ్చాను. మావదిన లావణ్యని కూడా ఇదే ప్రశ్న అడిగారు. అది మా వృత్తి. మేము ఎందుకు వదిలేస్తామనిచెప్పుకొచ్చింది. చాలా మాటలు అన్నారు... విడాకులు తర్వాత చాలా విషయాలు తెలిసొచ్చాయని చెబుతోంది మెగా డాటర్. ఎవరైన జీవితాంతం కలిసి ఉండాలనే పెళ్ళి చేసుకుంటారు. ఏడాదిలో విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోరు. కానీ ఏది అనుకున్నట్లు జరగదు కదా. నా గురించి రాసినా పట్టించుకునే దాన్ని కాదు. కానీ నా క్యారెక్టర్ ని తప్పు బట్టారు. చాలా బాధేసింది. బాగా ఏడ్చే దాన్ని అని చెబుతోంది నిహారిక. అలాంటి వాటిని భరించడం అంత ఈజీ ఏమీ కాదు. నా కుటుంబాన్ని కూడా నానా మాటలు అన్నారు. అప్పుడు మాత్రం తట్టుకోలేకపోయాను. కానీ నా కుటుంబం ఎప్పుడూ నన్ను బరువు అనుకోలేదు. విడుకుల తర్వాత ఈ రెండేళ్ళల్లో కుటుంబం విలువ ఏంటో బాగా తెలిసింది అని చెబుతోంది. నాకు ఇంకా 30 ఏళ్ళే... పెళ్ళి(Marriage)-విడాకులు(Divorce) తర్వాత ఎవరినీ నమ్మకూడదని బాగా తెలిసొచ్చింది అంటోంది నీహా. తనకు ఇదొక గుణపాఠం అని చెప్పింది. తాను ఎప్పటికీ ఎప్పటికీ సింగిల్ గా ఉండిపోననీ... తనకింకా 30 ఏళ్ళే అని అంటోంది. మంచి వ్యక్తి దొరికితే మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెబుతోంది కొణిదెల నీహారిక. Also Read : మెగా హీరో.. ‘పద్మ విభూషణ్’ చిరంజీవి ప్రస్థానమిదే! #mega-daughter #marriage #divorse #movies #niharika-konidela సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి