Hydra: హైడ్రా ఎఫెక్ట్.. భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు! తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్‌తో భూముల రిజిస్ట్రేషన్ భారీగా తగ్గిపోయింది. జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు రూ.320 కోట్లు తగ్గినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జులైలో 58 వేల రిజిస్ట్రేషన్లు కాగా.. ఆగస్టులో 41 వేల 200 మాత్రమే అయినట్లు వెల్లడించారు. By srinivas 04 Sep 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Hydra: తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్ శాఖపై ప్రభావం చూపిస్తోంది. అక్రమాలపై దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా.. పెద్ద ఎత్తున కట్టాడాలను కూల్చివేస్తోంది. దీంతో రాష్ట్రంలో భూములు కొనడం, అమ్మడం తగ్గిపోయింది. ఈ మేరకు జులైతో పోలిస్తే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టగా.. దాదాపు రూ.320 కోట్ల ఆదాయం తగ్గిపోయినట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, సంగారెడ్డిలో జులైలో 58 వేల రిజిస్ట్రేషన్లు అయితే ఆగస్టు నెలలో 41 వేల 200 మాత్రమే అయినట్లు అధికారులు తెలిపారు. జూలైలో రూ.11 వేల కోట్ల ఆదాయం రాగా ఆగస్టులో రూ.785 కోట్లు మాత్రమే వచ్చిందని, దీంతో రూ.320 కోట్లు తగ్గినట్లు వెల్లడించారు. #telangana #hydra #land-registraions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి