Viral Story: లాయర్ గారి మాజీ లవర్.. ఫ్యామిలీ న్యూడ్ ఫొటోలతో రివెంజ్! హైదరాబాద్‌లో మరో కిలాడీ లేడీకి బేడీలు పడ్డాయి. ప్రేమ పేరుతో వలపు వల విసిరి తర్వాత పెళ్లికి ముఖం చాటేసిన ఓ లాయర్‌పై ఓ అమ్మాయి కక్షగట్టింది. అతని ఫ్యామిలీ ఫొటోలను ఫేక్ చేసి వాటి న్యూడ్‌గా క్రియేట్ చేసి నెట్టింట్లో రిలీజ్ చేసింది. చివరకు పోలీసులకు దొరికిపోయింది. By Trinath 26 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Crime News: ప్రేమని ఒప్పుకోకపోతే మగాళ్లు మృగాలుగా మారడం చూశాం. అమ్మాయిలపై యాసిడ్ దాడులు, అఘాయిత్యాలు చేయడం విన్నాం. అయితే క్రైమ్‌కి జెండర్‌తో పని ఉండదు. మనసులోకి పగ అనే పొగ చూరితే... ఎవరైనా దిగజారిపోతారు. ఎంతకైనా తెగిస్తారు. తాజాగా హైదరాబాద్‌లో ఒక మాయలేడి ప్రియుడిపై పగబట్టింది. అతనికి పెళ్లయిందని చెప్పినా వినలేదు. తన ప్రేమని నిరాకరించాడన్న కసితో... ప్రియుడి కుటుంబ సభ్యుల ఫొటోలు మార్ఫింగ్ చేసింది. వారి నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెట్టి పైశాచిక ఆనందం పొందింది. అయితే అమ్మగారి అరాచకాల్ని ఆరా తీసిన పోలీసులు... బేడీలు వేసి ఆ కిలాడీ కేడీని కటకటాల్లో పడేశారు. అయితే ఈ మొత్తం తతంగం కోసం ఆ మాయదారి లేడీ వేసిన స్కెచ్ చూస్తే... ఎవరికైనా బుర్ర గిర్రున తిరగాల్సిందే. పెళ్లయిందంటూ ప్లేటు ఛేంజ్ చేశాడు: ఇంతగా దిగజారి న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టిన ఆ 24 ఏళ్ల యువతి పీజీ చదువుకుంది. యూపీఎస్‌సీకి ప్రిపేర్ అవుతోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్‌లో సివిల్స్ కోసం చదువుతోన్న ఆమెకి... అక్కడ టీచర్‌గా పనిచేస్తున్న వ్యక్తి పరిచయం అయ్యాడు. అమెకి 24, అతగాడికి 39 ఏళ్లు. కోచింగ్ సెంటర్‌లో టీచర్‌గా పనిచేస్తున్న అతను, హైకోర్టులో న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్యా కొన్నాళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిచింది. చివరికి తనని పెళ్లి చేసుకోవాలని యువతి అతగాడిని బలవంతం చేసింది. ప్రేమ అయితే ఓకే కానీ... పెళ్లి కష్టం అన్నాడు ఆ లాయర్ కేటుగాడు. అన్ని ముచ్చట్లు తీర్చుకున్నాక... తూచ్ పొమ్మన్నాడు. తనకి ఆల్రెడీ పెళ్లయిందంటూ ప్లేటు ఫిరాయించాడు. ఫేక్ అకౌంట్‌లో న్యూడ్ ఫొటోలు: తన ప్రేమని కాదన్న టీచర్‌పై పగ పెంచుకుంది ఆ యువతి. ఎలాగైనా కసి తీర్చుకోవాలనుకుంది. అయితే తన పేరు బయటకి రాకూడదు అనుకుంది. పక్కాగా ప్లాన్ గీసింది. ముందుగా అనంతపురంలో ఒక బిచ్చగాడికి 500 ఇచ్చి, అతని పేరుతో సిమ్ తీసుకుంది. మరో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర ఫోన్ కొన్నది. బిచ్చగాడి పేరుతో తీసుకున్న సిమ్‌ని, ఈ ఫోన్‌లో వేసుకుంది. దాని ఆధారంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది. ఇంకోవైపు ప్రియుడి కుటుంబసభ్యుల ఫోటోలు డౌన్‌లోడ్ చేసుకుని వాటిని నగ్నంగా మార్ఫింగ్ చేసింది. ఆ నగ్నచిత్రాలని తన ఫేక్ అకౌంట్‌లో పోస్ట్ చేయసాగింది. కిలాడీ లేడీకి బేడీలు: మరోవైపు ఈ మాయలేడి మాజీ ప్రియుడికి ఏమీ అర్ధం కాలేదు. తన కుటుంబసభ్యుల ఫొటోలు ఇలా ఎవరు చేస్తున్నారో అర్ధం కాలేదు. మొదట తన లాయర్ బుర్రతో ఆలోచించి చూశాడు. పరిస్థితి శృతి మించడంతో చివరికి పోలీసులని ఆశ్రయించాడు. పోలీసులు సిమ్ కార్డ్ ఆధారంగా వేట ప్రారంభించారు. ఆ సిమ్ ఓ బిచ్చగాడి పేరుతో ఉందని తెలుసుకుని షాక్ అయ్యారు. అతను చెప్పిన ఆధారాలతో... మరింత లోతుగా విచారణ చేశారు. చివరికి ఈ నగ్నచిత్రాల వెనుక ఉన్నది... లాయర్ గారి మాజీ ప్రియురాలే అని తెలుసుకున్నారు. ఆ కిలాడీ లేడీకి బేడీలు వేశారు. ఈ అమ్మడి తతంగం చదివారుగా.. తను అయితే జైలుకి వెళ్లింది. కానీ మనమంతా సోషల్ మీడియాలో అదే పనిగా కుటుంబసభ్యుల ఫోటోలు తెగ పెట్టేస్తుంటాం. వీటిని ఎవరైనా ఏమైనా చేయొచ్చు. ఇలా మార్ఫింగ్ చేసే మాయగాళ్ల చేతుల్లో ఆ ఫోటోలు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. సో తస్మాత్ జాగ్రత్త. Also Read: 8వ తరగతి బాలికపై అత్యాచారం..గర్భవతిని చేసిన పీఈటీ! WATCH కార్తీక దీపం(న్యూ) ప్రమో: #crime-news #hyderabad #viral-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి