Hyderabad: కుమారి ఆంటీ డైలాగ్స్ ఫాలో అవుతున్న హైదరాబాద్ పోలీసులు కుమారీ ఆంటీని తెగ ఫాలో అయిపోతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఆమె ఫేమస్ డైలాగ్ మీది 100 అయింది..లివర్ ఎక్స్‌ట్రాను కాపీ చేస్తూ మీది మెుత్తం రూ. 1000 అయ్యింది. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా అంటూ సోషల్ మీడియాలో ట్రాఫిక్ రూల్స్ మీద పోస్ట్ పెట్టారు. By Manogna alamuru 20 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad Traffice Police: ఇప్పుడంతా సోషల్ మీడియాదే హవా. ఇందులో ఏం వస్తే అదే జనాలు ఫాలో అయిపోతారు. అలా ఈ మధ్య హైదరాబాద్‌లో బాగా ట్రెండ్ అయిన వ్యక్తి కుమారీ ఆంటీ. హైటెక్ సిటీలో ఫుడ్ పాయింట్ నడుపుకునే కుమారి ఆంటీ సోషల్ మీడియా పుణ్యమాని రాత్రికి రాత్రికి ఫుల్ ఫేమస్ అయిపోయింది. పెద్ద సెలబ్రిటీ హోదా వచ్చేసింది. ఆమె మీద చేసిన వీడియోలు రీల్స్ కింద తెగ వైరల్ అవుతున్నాయి. ప్రతీ వాళ్ళు ఆమె డైలాగ్‌లు చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ పోలీసులు కూడా కుమారీ ఆంటీనే ఫాలో అవుతున్నారు. మీ బిల్లు మొత్తం రూ.1000..రెండు లివర్లు ఎక్స్‌ట్రా కుమారి ఆంటీ ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ డైలాగ్ మీద ట్రోల్స్, మీమ్స్, రీల్స్ ఒకటేమిటి అన్నీ వచ్చేశాయి. నిజానికి ఈ డైలాగే కుమారి అంటీని సెలబ్రిటీ కూడా చేసింది. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా వాడేసుకుంటున్నారు. మీది మొత్తం 1000 అయింది..యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అసలేం జరిగింది అంటే.. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. పైగా సెల్ ఫోన్ కూడా మాట్లాడుతున్నాడు. ఇతను ట్రాఫిక్ పోలీసుల కంటికి చిక్కాడు. ఏముందీ వెంటనే ఇతనికి ఫైన్ వేవారు. దాంతో పాటూ ఇతని ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ట చేసి...మీది మొత్తం 1000 అయింది..యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా అంటూ క్యాప్షన్ పెట్టారు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి..లేదంటే దెబ్బ పడుతుంది అని ఇలా కామెడీగా హెచ్చరించారు. Midhi motham 1000 ayindhi, user charges extra...#FollowTrafficRules #BeSafe#CellPhoneDriving pic.twitter.com/9kpxRKP8Ov — Hyderabad City Police (@hydcitypolice) February 20, 2024 Also Read:Hyderabad : మనిషి కాదు.. వాడు కీచక లాయర్ #hyderabad #social-media #kumari-aunty #traffic-police #dailouge మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి