hyderabad: బలి దేవత, ముద్దపప్పులకు స్వాగతం..రేవంత్‌రెడ్డి ఫొటోతో పోస్టర్‌లు కలకలం

మొదటి సారి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి టీకాంగ్రెస్‌ పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్ర నేతలు రానుండడంతో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ నేతలు.

New Update
hyderabad: బలి దేవత, ముద్దపప్పులకు స్వాగతం..రేవంత్‌రెడ్డి ఫొటోతో పోస్టర్‌లు కలకలం

మొదటి సారి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనికి టీకాంగ్రెస్‌ పార్టీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్ర నేతలు రానుండడంతో ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు తెలంగాణ నేతలు. వారికోసం హోటళ్లలో గదులు బుక్ చేయడంతో పాటు అన్నిరకాల ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం (నేడు) ఉదయం నుంచే కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో వస్తున్నారు. ఈ క్రమంలో భాగ్యనగరంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారీ పోస్టర్లు వెలిశాయి. రేవంత్‌రెడ్డి ఫొటోతో ఈ పోస్టర్లు టీకాంగ్రెస్‌ నేతల్లో కలకలం సృష్టిస్తోంది.

రేవంత్‌రెడ్డి ఫొటోతో పోస్టర్‌లు వెలిశాయి. ఈ పోస్టర్లలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ,రాహుల్‌గాంధీలతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సహా కీలక నేతల ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోల ఉన్న కీలక నేతలు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కామ్‌ల వివరాలను ముద్రించారు. అంతేకాదు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే సహా మొత్తం 24 మంది సీడబ్ల్యూసీ సభ్యుల పేర్లు, పోస్టర్లపై ఫొటోలు ఉన్నాయి. ఫొటోల కింద బివేర్ ఆఫ్ స్కామర్స్ అంటూ హెచ్చరికలను ముద్రించారు. ఈ హెచ్చరికల పక్కనే వైఎస్ఆర్ అన్న అక్షరాలు కూడా పెట్టారు. ఈ పోస్టర్లను ఎవరు ముద్రించారు..? గోడలపై అతికించింది ఎవరు..? అనే వివరాలు తెలియల్సింది.

బంజారాహిల్స్‌లో మరోసారి రేవంత్ రెడ్డి ఫొటోతో పోస్టర్‌లు కలకలం సృష్టిస్తోంది. సోనియాగాంధీని బలి దేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు, అని గతంలో అన్న మాటలు పోస్టర్ రూపంలో దర్శనం ఇచ్చాయి. ముద్దపప్పు, బలి దేవతకు స్వాగతం అంటూ వెలిసిన పోస్టర్‌లపై టీకాంగ్రెస్‌లో సర్వత్రా చర్చ నడుస్తోంది. గతంలో రేవంత్‌రెడ్డి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన మాటలను ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. నాడు బలి దేవత, ముద్దపప్పు అని మాట్లాడిన రేవంత్‌రెడ్డినే ఇవాళ తెలంగాణ తల్లి అంటూ స్వాగతం పలకడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ముక్కునవేలు వేసుకుంటున్నారు.

Posters with Revanth Reddy photo are scattered in Banjara Hills

పోస్టర్లలో ఉన్న వారిలో ప్రధానంగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఖర్గే, ఏకే ఆంటోనిల ఫొటోల కింద నేషనల్ హెరాల్డ్ స్కామ్, దిగ్విజయ్ సింగ్ ఫొటో కింద రిక్రూట్‌మెంట్ స్కామ్, మీరా కుమార్ ఫొటో కింద ఎన్ హెచ్ఏ స్కామ్, చిదంబరం ఫొటో కింద ఫోర్జరీ, స్టాక్ మార్కెట్ , శారదా చిట్ ఫండ్, వీసా స్కామ్‌, మన్మోహన్ సింగ్ ఫొటో కింద కోల్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వివరాలు ఉన్న పోస్టర్లు ఉన్నాయి. మిగతా నేతల ఫొటోల కింద కూడా వారి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వినిపించిన స్కామ్‌ల వివరాలను ముద్రించి అతికించారు. ఈ పోస్టర్లు టీకాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

Posters with Revanth Reddy photo are scattered in Banjara Hills

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana: ఈ జిల్లాల్లో మళ్లీ  వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ!

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు బుధ, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది.

New Update
hyd

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రానున్న రెండు రోజులు.. పాటు బుధవారం, శుక్రవారం భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభావిత జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Also Read: Mujra Party : మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!

IMD విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, హన్మకొండ జిల్లాల్లో ఏప్రిల్ 9వ తేదీన ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.అంతేకాకుండా.. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు.

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

ఈదురుగాలుల వల్ల చెట్లు విరిగిపడే అవకాశం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు సురక్షితమైన చోటుకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా రాష్ట్రంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. నిన్న హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 39.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రానున్న వర్షాల నేపథ్యంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను సూచిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల తర్వాత ఒక్కసారిగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ప్రజలు ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక నిజామాబాద్ జిల్లాలో వాతావరణంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాదాపు ఐదు రోజుల క్రితం ఈ జిల్లాలో బలమైన ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీని ఫలితంగా జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే.. వారం రోజుల పాటు చల్లగా ఉన్న వాతావరణం ఆదివారం నుండి మళ్లీ వేడిగా మారుతుంది. గత మూడు రోజులుగా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. అయితే.. రానున్న వర్ష సూచనతో నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనపడుతున్నాయి.

వాతావరణ శాఖ ఈ హెచ్చరికల నేపథ్యంలో.. ఆ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు తగిన సూచనలు జారీ చేయడంతో పాటు.. సహాయక చర్యలు చేపట్టేందుకు రెడీ గా ఉంది. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున.. మరమ్మత్తు బృందాలను ముందుగానే సిద్ధం చేశారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

Also Read: Pawan Kalyan: 3 రోజులపాటు ఆస్పత్రిలోనే పవన్‌ చిన్న కుమారుడు!

Also Read: America: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

telngana | adilabad | nizamabad | rains | rain-alert | telangana-rain | telangana rain alert | telangana rains today | telangana rains update | telangana rains updates | telangana-rains | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment