Telangana: కబ్జా నాగేందర్‌.. రూ.300 కోట్ల విలువైన భూమి ఆక్రమణ..?!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారు బేగంపేట బస్తీ వాసులు. భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశ్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీగా ప్రజాభవన్ వద్దకు చేరుకున్న వారు నాగేందర్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

New Update
Telangana: కబ్జా నాగేందర్‌.. రూ.300 కోట్ల విలువైన భూమి ఆక్రమణ..?!

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణలు కలకలం రేపాయి. ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్‌ తమ భూములు ఆక్రమిస్తున్నారంటూ బేగంపేట బస్తీ వాసులు ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రజావాణిలో ఈ మేరకు ఫిర్యాదు చేసి వినతిపత్రం అందించారు. రెక్కలుముక్కలు చేసుకుని తాము కొనుక్కున్న భూమిని ఎమ్మెల్యే దానం ఆయన అనుచరులతో కబ్జా చేయించారని ఆరోపించారు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూలగొడుతున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే తమను హింసిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకాశ్ నగర్ నుంచి ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ర్యాలీగా ప్రజాభవన్ వద్దకు చేరుకున్న వారు నాగేందర్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రూ.300కోట్ల విలువ చేసే భూమి..

ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్తున్న భూమి దాదాపు రెండెకరాలు ఉంటుంది. ఆ భూమి విలువ దాదాపు రూ.300కోట్ల వరకూ ఉంటుందని చెప్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులు సుధీర్‌, ఆరిఫ్‌ తో పాటు మరికొందరు తమను వేధింపులకు గురిచేస్తున్నారని, వారి గ్యాంగ్ రాత్రి వేళ మద్యం, గంజాయి తీసుకుంటూ అరాచకం సృష్టిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జేసీబీలను పెట్టి కొన్ని ఇళ్లను కూలగొట్టారని, మిగతా ఇళ్లన్నింటినీ కూలగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

రెక్కలు ముక్కలు చేసుకుని కొనుక్కున్నాం..

వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నోటరీ భూములను కొనుక్కుని ఇల్లు కట్టుకుని 20 ఏళ్లుగా వాటిలో ఉంటున్నామని వారు తెలిపారు. తమ భూమిని ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అనుచరులతో కబ్జా చేయాలని ప్రయత్నిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇళ్లను కూలగొట్టిస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. అధికారులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదని వాపోయారు. ఈ ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం చేయాలని కోరారు.

Also read:

హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు.. ఇదిగో వీడియోలు!

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు..

Advertisment
Advertisment
తాజా కథనాలు