Summer Cool: ఫ్రిడ్జ్ అవసరమే లేదు.. ఈ చిన్న చిట్కాతో మీ వాటర్ కూల్ అయిపోతుంది! వేసవిలో ప్లాస్టిక్ బాటిళ్లలో ఉంచిన నీరు త్వరగా వేడెక్కుతుంది. అందుకే ఇన్సులేటెడ్ బాటిళ్లను ఉపయోగించవచ్చు. ఈ బాటిల్‌లో నీరు ఎక్కువ సేపు చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో నీటిని చల్లగా ఉంచడానికి మీరు కూలర్ బాక్స్‌ను ఉపయోగించవచ్చు. ఇక మట్టి కుండ అయితే అన్నిటికంటే బెస్ట్. By Trinath 28 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Summer Cooling Water: వేసవి కాలం సెగలు రేపుతోంది. క్రమంగా వేసవి ప్రభావం పెరగడం మొదలైంది. వేసవిలో చాలా దాహం వేస్తుంది. అందుకే ఎక్కువ నీరు తాగుతుంటారు ప్రజలు. నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం కూడా. వేసవిలో దాహం వేసినపుడు వేడినీళ్లు అందితే దాహం తీరినట్టు అనిపించదు. అందుకే చాలామంది ఫ్రిడ్జ్ లోని చల్లటి నీళ్లు తాగుతారు. అయితే ఇలా ఫ్రిడ్జ్ వాటర్ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అటు చాలా మంది ఖరీదైన రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేయలేరు కూడా. మరి ఏం చేయాలి? ఫ్రిడ్జ్ వాటర్ తాగకుండా ఎలా ఉండాలి అని ఎక్కువగా ఆలోచించద్దు. రిఫ్రిజిరేటర్ లేకుండా ఇంట్లోనే నీటిని చల్లబరిచే కొన్ని ప్రత్యేక పద్ధతుల గురించి తెలుసుకోండి. --> కుండ నీరు చాలా చల్లగా ఉంటుంది. నీటిని ఉంచే మట్టి కుండను తడి గుడ్డతో కప్పండి. ఇలా చేయడం వల్ల నీరు ఎక్కువ సేపు చల్లగా ఉంటుంది. --> మనలో చాలా మంది ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతుంటారు. వేసవిలో ప్లాస్టిక్ బాటిళ్లలో ఉంచిన నీరు త్వరగా వేడెక్కుతుంది. అయితే వేసవిలో ప్లాస్టిక్‌కు బదులుగా ఇన్సులేటెడ్ బాటిళ్లను ఉపయోగించవచ్చు. ఇన్సులేటెడ్ బాటిల్‌లో నీరు ఎక్కువ సేపు చల్లగా ఉంటుంది. --> వేసవి కాలంలో నీటిని చల్లగా ఉంచడానికి మీరు కూలర్ బాక్స్‌ను ఉపయోగించవచ్చు. మార్కెట్‌లో ఈ వాటర్ కూలింగ్ కూలర్ బాక్స్‌ను ఈజీగా పొందచ్చు. వేసవి కాలంలో ఐస్ బాక్స్ కూడా ఉపయోగపడుతుంది. కొన్ని మంచు ముక్కలను ఉంచడం ద్వారా మీ బాటిల్‌ను కూల్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల నీరు ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కస్టడీ #fridge #summer #summer-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి