Fake Medicines: మెడికల్ షాప్‌లో ట్యాబ్లెట్లు కొంటున్నారా? వాటిలో నకిలీ మందులను గుర్తించడం ఎలా? ఔషధాల ప్యాకేజింగ్‌ను చూసి అవి నిజమో కాదో తెలుసుకోవచ్చు. నకిలీ మందుల ప్యాకేజింగ్‌పై సంబంధిత ఔషధం గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. అనేక మందులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే మెడిసన్ గురించి పూర్తి సమాచారం రావాలి. అలా రాకపోతే అది ఫేక్ మెడిసన్. By Trinath 11 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి How To Identify Fake Medicine: వివిధ వ్యాధుల చికిత్సలో ట్యాబ్లెట్లే ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఏదైనా తీవ్రమైన అనారోగ్యం సంభవించినప్పుడు మనల్ని ఆరోగ్యంగా మార్చేవి ముందులే. మన ఆరోగ్యాన్ని కాపాడటానికి అనేక మందు బిల్లలు ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో చాలా మెడికల్ స్టోర్లలో అసలైన మందుల పేరుతో ప్రజలకు నకిలీ మందులను విక్రయిస్తున్నారు. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. చాలా సార్లు ప్రజలు ఈ నకిలీ మందులను వినియోగిస్తున్నారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నకిలీ మందులను ఎలా గుర్తించాలో తెలుసుకోవాలి. ➡ ఔషధాల ప్యాకేజింగ్‌ను చూసి అవి నిజమో కాదో తెలుసుకోవచ్చు. ప్యాకేజింగ్ సరిగా లేకపోతే అది ఫేక్ కావొచ్చు. అంతే కాకుండా నకిలీ మందుల ప్యాకేజింగ్‌పై సంబంధిత ఔషధం గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. ➡ అసలైన మందులను ఫార్మా కంపెనీలు సరిగ్గా ప్యాక్ చేస్తాయి. మెడిసన్ గురించిన ప్రతి సమాచారం దానిపై స్పష్టంగా ప్రింట్ చేసి ఉంటుంది. ➡ ఈ రోజుల్లో అనేక మందులపై క్యూఆర్ కోడ్‌లను (QR Code) కూడా తయారు చేస్తున్నారు. ఈ QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా మీరు ఔషధానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ➡ మీరు మెడికల్ స్టోర్ నుంచి మందులు కొనుగోలు చేసిన తర్వాత కచ్చితంగా ఆ మందును మీ డాక్టర్‌కు చూపించండి. మెడిసన్ అసలైనదా లేదా నకిలీదా అని డాక్టర్ ఈజీగా చెప్పగలరు. Also Read: ఈ టిప్స్ పాటిస్తే వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపిస్తారు..! #life-style #health-news #fake-medicines మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి