Match Lose Effects: మీ ఫేవరెట్ టీమ్ ఓటమిని ఎలా తట్టుకోవాలి..? మెదడులో వచ్చే మార్పులకు ఇలా చెక్ పెట్టండి!

వ్యక్తుల మెదడు, మానసిక స్థితిని స్పోర్ట్స్ ఫ్యాన్‌డమ్ ప్రభావితం చేస్తుంది. మ్యాచ్ ఓటమి అనేది ఫ్యాన్స్ మానసిక శ్రేయస్సును ఎలా దెబ్బతీస్తుంది, ఇష్టమైన టీమ్ ఓడిపోతే ఫ్యాన్స్‌లో ఆందోళన కనిపిస్తుంది..దీన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.

New Update
Match Lose Effects: మీ ఫేవరెట్ టీమ్ ఓటమిని ఎలా తట్టుకోవాలి..? మెదడులో వచ్చే మార్పులకు ఇలా చెక్ పెట్టండి!

భారతదేశంలోని స్పోర్ట్స్ లవర్స్ (Sports lovers) లైవ్ క్రికెట్ లేదా కబడ్డీ, ఫుట్‌బాల్, ఇతర మ్యాచ్‌లను చూడటానికి ఇష్టపడతారు. లైవ్ ఆడియన్స్, ఇతర ఫ్యాన్స్‌తో కలిసి ఫేవరెట్ టీమ్‌కు సపోర్ట్ చేస్తారు. ఆ జట్టు గెలవాలని బాగా ఆశిస్తారు. దీన్నే స్పోర్ట్స్ ఫ్యాన్‌డమ్ (Sports fandom) అంటారు. కానీ ఆ టీమ్ మ్యాచ్‌లో ఓడిపోతే డీలా పడిపోతారు. అయితే సైకాలజీ ప్రకారం.. వ్యక్తుల మెదడు, మానసిక స్థితిని స్పోర్ట్స్ ఫ్యాన్‌డమ్ ప్రభావితం చేస్తుంది. మ్యాచ్ ఓటమి అనేది ఫ్యాన్స్ మానసిక శ్రేయస్సును ఎలా దెబ్బతీస్తుంది, దీన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం.

ఏదైనా మ్యాచ్‌లో ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేసిన ఫేవరెట్ టీమ్‌ ఓడిపోయినప్పుడు, వారి మెదడు కెమిస్ట్రీలో మార్పులు వస్తాయి. ఆట ఫలితాన్ని బట్టి అభిమానులకు హార్మోన్ల మార్పులు జరుగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక టీమ్ లాస్ మేల్ ఫ్యాన్స్‌లో టెస్టోస్టెరాన్ (Testosterone) స్థాయిలలో తాత్కాలిక తగ్గుదలకు కారణమవుతుంది. తద్వారా వారు నిరాశకు గురవుతారు. అలాగే ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ (Cortisol) పెరుగుతుంది. అందుకే ఇష్టమైన టీమ్ ఓడిపోతే ఫ్యాన్స్‌లో ఆందోళన కనిపిస్తుంది.

* ఎలా మేనేజ్ చేయాలి?

మ్యాచ్ ఓటమిని ఆరోగ్యకరమైన రీతిలో ఎదుర్కోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా స్పోర్ట్స్‌లో హీరోలను చూసే యువకులు నిరాశ పడిపోకూడదు. ఆటలో టీమ్ ఆడిన బెస్ట్ పార్ట్స్‌పై మాత్రమే దృష్టి పెట్టాలి, టీమ్ వర్క్‌ను అభినందించాలి. భవిష్యత్తులో మంచి ఫలితాల కోసం ఆశించాలి. క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహిస్తూ ఓటమి ఆటలో ఒక భాగమని అంగీకరించాలి.

* ఓటమిని తట్టుకోవాలి

స్పోర్ట్స్ ఫ్యాన్స్ ఓటమి తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే బాధ నుంచి ఈజీగా బయటపడటం సాధ్యమవుతుంది. ఇతర అభిమానులతో మాట్లాడటం, శారీరకంగా చురుకుగా ఉండటం, క్రీడలు ఆడటం ద్వారా దేన్నైనా తట్టుకోగల, బాధ నుంచి వెంటనే బయటపడగల సామర్థ్యం పెంచుకోవచ్చు. ఈ యాక్టివిటీస్ ఉపశమనం, ఆనందాన్ని అందించగలవు.మెంటల్ హెల్త్ కాపాడుకోవడానికి ఓటమి తర్వాత ‘ఇది కేవలం గేమ్’ అని లైట్‌గా తీసుకునే మైండ్‌సెట్ డెవలప్ చేసుకోవాలి. ఒకే టీమ్‌ని సపోర్ట్ చేసే కమ్యూనిటీ క్రియేట్ చేసుకోవడం, పాజిటివ్ స్పోర్ట్స్ కల్చర్‌ను సపోర్ట్ చేయడం ద్వారా స్పోర్ట్స్ ఫ్యాన్‌డమ్‌ పట్ల పాజిటివ్ ఆట్టిట్యూడ్ డెవలప్ చేసుకోవచ్చు. క్రీడాభిమానులపై, ముఖ్యంగా యువకులపై మ్యాచ్ ఓటమి ఎక్కువ మానసిక ప్రభావం చూపుతుంది. అయితే ఓటములు అనివార్యం, కానీ అవి ఎదుగుదలకు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశాలుగా మారవచ్చు. ఈ విషయాలను ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఇలా స్పోర్ట్స్ ఫ్యాన్‌డమ్‌ మీ రోజువారీ పనులు, ఎమోషన్స్‌ను ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు