అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి..వైద్యులు ఏమన్నారంటే!

హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు అనారోగ్యానికి గురయ్యారు.గత కొన్ని రోజులుగా ఆయన కడుపులో ఇన్‌ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీలో చేర్పించారు.

New Update
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి..వైద్యులు ఏమన్నారంటే!

హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం అర్థరాత్రి ప్రాంతంలో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

గత కొన్ని రోజులుగా ఆయన కడుపులో ఇన్‌ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీలో చేర్పించారు.

Also read:భగ్గుమంటున్న బండి సంజయ్.. బీజేపీలో అసలేం జరుగుతోంది?

వైద్యుల బృందం ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అల్ట్రాసౌండ్‌ రిపోర్ట్‌ నార్మల్‌ అని వైద్యులు వివరించారు. మిగతా పరీక్షల్లోనూ అంతా నార్మల్‌ గానే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు

కాగా, ఇటీవల ధర్మశాలలో జరిగిన ఇండియా, న్యూజిలాండ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ను సీఎం సుఖు కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్, జేపీ నడ్డాలతో కలిసి స్టేడియంలో వీక్షించారు.

కొన్ని రోజుల క్రితం సీఎం రైలులో పరిచయం అయిన ఓ చిన్నారికి తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన ఉదార గుణాన్ని అభిమానులు, నెటిజన్లు అభినందించారు.

Also read: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ పరీక్ష రద్దు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు