Telangana: బతుకమ్మ, దసరా సంబరాలు.. నగరంలో ప్రయాణికుల రద్దీ.. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగరవాసులు తమ సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో ఆదివారం ఉదయం నుంచి రద్దీ వాతావరణం నెలకొంది. దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో రోజువారీ 3,500 బస్సులకు అదనంగా 1,700 అదనపు బస్సులు ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. By B Aravind 22 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా పండుగ సందర్భంగా జనం పెద్దఎత్తున తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లడంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్లలో రద్దీ నెలకొంది. ఉప్పల్, ఎల్బీ నగర్, మెహిదీపట్నం, తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు సైతం కిక్కిరిసిపోయాయి. దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో రోజువారీ 3,500 బస్సులకు అదనంగా 1,700 అదనపు బస్సులు ఉన్నాయి. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక నాంపల్లి,సికింద్రాబాద్,కాచిగూడ వంటి రైల్వే స్టేషన్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రద్దీ నెలకొంది. సాధారణంగా రైళ్లకు ముందుగానే రిజర్వేషన్లు బుక్ చేసుకోవడం వల్ల, చాలా మంది ప్రయాణికులు జనరల్ కోచ్‌లను ఆశ్రయించారు. ఈ ఫలితంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే సాధారణ బోగీలు కూడా నిండిపోయాయి. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి వరకు దాదాపు 600 అదనపు సర్వీసులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో పాటు కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, కర్నూలు, విశాఖ, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి తదితర ప్రాంతాలకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగుతాయని, అదనపు రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. #telugu-news #telangana-news #dasara #bathukamma-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి