Telangana: తీవ్ర ఉద్రిక్తతగా బండి సంజయ్ ప్రజాహిత యాత్ర బండి సంజయ్ ప్రజాహిత యాత్ర తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హూస్నాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు యాత్రను అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్త మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో బండి సంజయ్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు టమాటాలు, కోడి గుడ్లతో దాడి చేశారు. By Manogna alamuru 27 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Attack on Bandi Sanjay Yatra: హుస్నాబాద్‌లో భారీ పోలీస్ బందోబస్తుతో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. అయినప్పటికీ అక్కడకి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుని యాత్రను అడ్డుకున్నారు. బండి సంజయ్ మీద దాడికి దిగారు. బీజేపీ ఫ్లెక్సీలను దహనం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యాలను నిరసిస్తూ బండి మీద టమాటాలు, కొడిగుడ్లతో దాడి చేశారు. తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదు.. యాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బండి సంజయ్ హెచ్చరించినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఎక్కడా తగ్గలేదు. తాను ఎవరినీ కించపర్చేలా మాట్లాడలేదని సంజయ్ అన్నారు. అలాగే పొన్నం తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని...మరి పొన్నం ఓడిపోతే ఆయన కూడా తనలానే చేస్తారా అని ప్రశ్నించారు. తాను తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే లీగల్‌గా చర్యలు తీసుకోవచ్చని అన్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ బండి సంజయ్‌కు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బండి సంజయ్ విశ్రాంతి తీసుకుంటున్న బొమ్మనపల్లి కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. Also Read:Visakhapatnam : గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. #telangana #bandi-sanjay #high-tension #prajahita-yatra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి