కొత్త పార్టీ పెట్టిన హీరో నాని.. మేనిఫెస్టో వీడియో వైరల్

స్టార్ హీరో నాని తన అప్ కమింగ్ మూవీ 'హాయ్ నాన్న'ను పొలిటికల్ పార్టీ స్టైల్ లోనే ప్రచారం చేస్తున్నారు. ‘హాయ్‌ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్‌ విరాజ్‌ను. మా మేనిఫెస్టో ఇదే అంటూ ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు. పొలిటీషియన్స్ ఎన్ని కబుర్లు చెప్పినా తన పార్టీకే ఓటు వేయాలని కోరారు.

New Update
కొత్త పార్టీ పెట్టిన హీరో నాని.. మేనిఫెస్టో వీడియో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరో నాని ఓ ఫన్నీ వీడియోతో అభిమానులు, నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. తెలంగాణలో ఎన్నిక‌ల జోరు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. కాగా ఇదే క్రమంలో తన అప్ కమింగ్ మూవీ 'హాయ్ నాన్న'కోసం రాజకీయనాయకుడిగా మారిన ఆయన ఈ మూవీ ప్రమోషన్స్ సరికొత్తగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌ల‌ను ప్రేక్షకులను అలరిస్తుండగా తాజాగా రిలీజ్ చేసిన నాని పొలిటికల్ గెట‌ప్‌ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది.

ఈ మేరకు శౌర్యువ్ ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా మేకర్స్ తమ చిత్రాన్ని పొలిటికల్ పార్టీ స్టైల్ లోనే ప్రచారం చేస్తుండగా 'రిలీజ్ దెగ్గరలో ఉంది. ఎలక్షన్స్ మధ్యలో వున్నాయి. వాడేయటమే' అంటూ రాజ‌కీయ నాయ‌కుడి గెట‌ప్‌లో ఉన్న నాని ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్న ఒక వీడియో విడుద‌ల చేశారు. 'నేను మీ ‘హాయ్‌ నాన్న’ పార్టీ ప్రెసిడెంట్‌ విరాజ్‌ను. Manifesto లు అంటే నోటికొచ్చింది చెప్పేస్తున్నారు అందరూ. నేనూ ఒక రాయి ఏసా. మా మేనిఫెస్టో ఇదే. మన హాయ్ నాన్న పార్టీ కనుక అధికారంలోకి వస్తే.. యూత్ అందరికి రీల్స్ చేసుకోడానికి విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్స్ అండ్ లైటింగ్ సెటప్ లు అన్ని కూడా కిట్లు కిట్ల కింద పంచి పెడతాం. అందరి ఆదాయం పెంచేలా చూస్తాం. థియేటర్‌ల ఆదాయం అలాగే వాటి పక్కన ఉన్న కిరాణా కొట్టుల ఆదాయం పెంచేలా చూస్తాం' అన్నారు. అలాగే ఈ వీడియో చివరలో సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ ఆడ్ చేస్తూ.. 'మా పార్టీకే ఓటు వేయండి. పొలిటీషియన్స్ ఇలాంటి క‌బుర్లు ఎన్ని అయినా చెబుతారు. కానీ మీ మనసుకు తెలుసు. మీకు ఆలోచిస్తే అర్థమయిపోతుంది. మంచోడికే ఓటు వేయండి' అంటూ నాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్, నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Also read : కలలను చూడాలనుకునే వారి కల నేరవేరుస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు.. ఎలాగో తెలుసా?

ఇక తండ్రీ కూతుళ్ల కథతో వస్తున్న మూవీలో మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా కనిపించనుండగా నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటించింది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మించిన సినిమాకు హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు