Watch Video : రైలు చక్రాల మధ్య కూర్చోని 100 కి.మీ ప్రయాణించిన బాలుడు..

ఉత్తరప్రదేశ్‌లో ఓ గూడ్స్ రైలు చక్రాల మధ్య కూర్చోని ఓ ఐదేళ్ల బాలుడు ఏకంగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించాడు. అతడిని గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. అనంతరం ఆ బాలుడిని చైల్డ్‌ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.

New Update
Watch Video : రైలు చక్రాల మధ్య కూర్చోని 100 కి.మీ ప్రయాణించిన బాలుడు..

Kid Travel : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ గూడ్స్ రైలు చక్రాల మధ్య కూర్చోని ఓ ఐదేళ్ల బాలుడు ఏకంగా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించాడు. అతడిని గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది(RPF Staff) సురక్షితంగా రక్షించారు. ఆ బాలుడిని చైల్డ్‌ వెల్ఫేర్ కమిటీ(Child Welfare Committee) కి అప్పగించారు. అలాగే చిన్నారి తండ్రిని కూడా సంప్రదించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని.. దీనిపై విచారణ జరిపించాలని రైల్వేశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also read: తమన్నకు సమన్లు జారీ చేసిన మహారాష్ట్ర సైబర్ సెల్‌.. ఎందుకంటే

ఇక వివరాల్లోకి వెళ్తే.. చార్బాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఓ గూడ్స్ రైలు బయలుదేరింది. అయితే అది స్టార్ట్ కాకముందే ఓ ఐదేళ్ల బాలుడు(5 Years Old Boy) ఆడుకుంటూ ఆ రైలు వద్దకు వచ్చాడు. ఆ తర్వాత దాని చక్రాల మధ్యకు వెళ్లి నిద్రపోయాడు. అయితే ఒక్కసారిగా కదలడంతో ఆ బాలుడు బయటికి రాలేకపోయాడు. చివరికి ఆ చక్రాలపైనే కూర్చుని 100 కి.మీ వరకు ప్రయాణించాడు.

హర్దోయ్ రైల్వే స్టేషన్‌కు ఆ గూడ్స్ రైలు వచ్చాక ఆర్ఫీఎఫ్‌ సిబ్బంది తనిఖీలు చేశారు. చివరికి ఆ రైలు చక్రాల మధ్య బాలుడు ఉన్నట్లు గుర్తించి బయటకు తీశారు. ఆ తర్వాత చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించి.. అతడి తండ్రిని కూడా సంప్రదించారు. ఆ బాలుడు జరిగిందంతా అధికారులకు చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read: ప్రైవేటు ఆస్తి..సమాజానికి చెందినది కాదని అనలేం..సుప్రీంకోర్టు వ్యాఖ్య

Advertisment
Advertisment
తాజా కథనాలు