TG News: తక్షణమే వారిని అక్కడినుంచి తరలించండి.. డీజీపీలకు సీఎం రేవంత్ ఆదేశాలు! భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. By srinivas 31 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో మాట్లాడిన సీఎం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్‌కు సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తుతున్న దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. #cm-revanth #telangana #heavy-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి