Weather Alert : తమిళనాడులో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నైతో పాటు మరో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది.

New Update
Weather Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం

Tamilnadu : తమిళనాడులో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. రాగల 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నైతో పాటు మరో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ (Red Alert) ను జారీ చేసింది. ఇప్పటికే వర్షం ప్రభావానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. రోడ్లన్ని జలమయం అయ్యాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also read: మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

ఇదిలాఉండగా.. ఇవాళ నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 48 గంటల్లో ఇది వాయుగుండగా మారుతుందని చెప్పింది. అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ బలపడనుందని తెలిపింది. దీని ప్రభావంతో తెలగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురస్తాయని స్పష్టం చేసింది.

Also read: వాహనాదారులకు అలెర్ట్.. పెరగనున్న టోల్‌ప్లాజా ఛార్జీలు

Advertisment
Advertisment
తాజా కథనాలు