Mumbai: ముంబైకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్

ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. రహదారులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్ట్ అన్నీ జలమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 24 గంటల్లో ముంబైలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

New Update
Mumbai: ముంబైకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్

Heavy rains: ముంబైలో వర్షాలు తెగ కురుస్తున్నాయి. ఆగకుండా పడుతున్న వానలతో అక్కడి ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. దీంతో పాటూ ముంబై నగరానికి కేంద్ర వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ప్రజలను ఇళ్ళల్లోంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పౌరసరఫరాల సంస్థ కోరింది. పుకార్లను నమ్మవద్దని కోరింది. సహాయం కోసం మెయిన్ కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్ 1916కు డయల్ చేయాలని ప్రజలను కోరింది.

మరోవైపు భారీగా పడుతున్న వర్షాల కారణంగా ముంబైలోని రైల్వే ష్టేషన్లు ఎయిర్ పోర్ట్ అన్నీ జలమయమయ్యాయి. ఎయిర్ పోర్ట్‌లో నీళ్ళు నిలిచిపోవడంతో నిన్న 50 విమానాలను రద్దు చేశారు. అలాగే పలు రైళ్ళు కూడా రద్దయ్యాయి. ఇక ముంబై రోడ్ల పరిస్థితీ అలాగే ఉGది.రోడ్ల మీద నీరు ఎక్కడిక్కడే నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read:Jio: జియో కొత్త 5జీ బూస్టర్ ప్లాన్

Advertisment
Advertisment
తాజా కథనాలు