Weather Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీవర్షం కురిసింది. ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. తెలంగాణలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

New Update
Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీవర్షం కురిసింది. ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్, ఎల్బీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, కోఠీ, మలక్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రోడ్లన్ని జలమయమయ్యాయి. చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు ఏపీలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Also Read: రేపటి నుంచి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే నిరాహార దీక్ష.. ఎందుకో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు