Rain Alert in Telangana: తెలంగాణలో వానలే వానలు.. హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్‌ వాతావరణశాఖ

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పాడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బంగాళాఖాతం తీరాల మీదుగా బలపడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో రానున్న మరో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
Rain Alert in Telangana: తెలంగాణలో వానలే వానలు.. హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్‌ వాతావరణశాఖ

మోస్తరు వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పాడింది. వాయువ్య బంగాళాఖాతం సహా ఉత్తర ఒడిశా-పశ్చిమ బంగాళాఖాతం తీరాల మీదుగా బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మరో 3 రోజుల పాటు తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్,రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని అధికారులు తెలిపారు.

పలుచోట్ల తేలికపాటి వర్షాలు

నేడు తెలంగాణలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీ (AP) రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. గంటకు 40 నుంచి 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి ఉభయగోదావరి, విజయనగరం, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 6 నుంచి 12 మధ్య ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఐఏండీ సూచనలు

ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఏండీ (IMD) సూచన సూచించింది. IMD యొక్క సూచన ప్రకారం వారం చివరి భాగంలో సెప్టెంబర్ (ఈనెల 15 నుంచి 21 వరకు) తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశాన్ని సూచిస్తోంది. ఈ తుఫాను ప్రసరణ 2వ వారం (సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు) ప్రారంభంలో ఉత్తర బంగాళాఖాతం వైపు పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు, 33 జిల్లాల్లో, 2 జిల్లాల్లో  ఎక్కువ వర్షపాతం నమోదైంది, 9 జిల్లాల్లో అధిక వర్షపాతం.. 11 జిల్లాలో సాధారణ వర్షపాతం, 8 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైదని తెలిపారు. అంతేకాకుండా 3 జిల్లాల్లో గత వారం రోజులుగా భారీ వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. ఈ రుతుపవనాల టైంలో, తెలంగాణ సాధారణ కేటగిరీలో ఉండగా.. వాస్తవ వర్షపాతం 643.4 మిల్లి మీటర్లకి వ్యతిరేకంగా 765.2 మిల్లి మీటర్ల ఉంది. ఇదిలావుండగా, తెలంగాణ రాష్ట్రం డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తన సూచనను విడుదల చేసింది. రాబోయే మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌ (Hyderabad) లో చాలా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

Also Read: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Advertisment
Advertisment
తాజా కథనాలు