Telangana: రాగల రెండు రోజులు వడగాల్పులు.. బయటకు రావొద్దని హెచ్చరిక

తెలంగాణలో రాగాల రెండురోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని.. వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించింది.

New Update
Telangana: నిప్పుల కొలిమిల తెలంగాణ ..ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు మృతి.. మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

Heat Wave in Telangana: తెలంగాణలో రాగల రెండురోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఎండలు కూడా రెండు, మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోగవుతున్నాయని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎల్లుండి తర్వాత ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.

Also Read: ఎమ్మెల్సీ కవితకు ఊహించని ట్విస్ట్

శనివారం.. నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌,మహబూబ్‌నగర్‌, నిర్మల్‌, కొత్తగూడెం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదివారం నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, ఖమ్మం, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను (Yellow Alert) జారీ చేసింది. అలాగే ఆదివారం నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇక యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి ,పెద్దపల్లి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్ 9న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Also Read: అమెరికాలో మిస్సైన హైదరాబాద్ యువకుడు.. నెల రోజులుగా కనిపించని ఆచూకి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వీసాల రద్దు ఆపండి..విద్యార్థులకు అమెరికా న్యాయస్థానం ఊరట

అమెరికాలో వీసాలు రద్దయిన విద్యార్థులకు అక్కడి న్యాయస్థానం ఊరట కల్పించింది. మొత్తం 133 మంది స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ను న్యాయస్థానం పునరుద్ధరించింది. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. 

New Update
F1 Visa

F1 Visa

ఇటీవల అమెరికాలో వీసాల రద్దు లేదా స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(సెవీస్‌) రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించి విద్యార్థులు, న్యాయవాదులు, యూనివర్సిటీ ఉద్యోగుల నుంచి 327 కేసు నివేదికలను ఈ సంఘం సేకరించింది. ఈ అంతర్జాతీయ విద్యార్థులలో సగం మంది భారతదేశానికి చెందిన వారు కాగా 14 శాతం మంది చైనా విద్యార్థులని ఏఐఎల్‌ఏ ప్రకటించింది. మిగిలిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణ కొరియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌కు చెందిన వారని తెలిపారు. 

ఇప్పుడు వీరందరికీ అక్కడి న్యాయస్థానం ఊరట కల్పించింది. మొత్తం 133 మంది స్టూడెంట్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ను న్యాయస్థానం పునరుద్ధరించింది. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.  విద్యార్థుల వీసాల రద్దులో ప్రభుత్వం నిర్ణయం సరికాదని ఇమ్మిగ్రేషన్ లాయర్లు చెప్పారు. అయితే అమెరికా ప్రభుత్వ ఏజెన్సీల వాదన మాత్రం వేరేగా ఉంది. విద్యార్థులు పలు సందర్భాల్లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల దృష్టిలోపడ్డారని చెబుతున్నాయి. ఈనేపథ్యంలో తాము తాత్కాలికంగా అడ్డుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెబుతున్నాయి. కానీ, ఈ విద్యార్థులకు ఎటువంటి నేర చరిత్ర లేదు.

అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు ఏకపక్షంగా జరుగుతున్నట్లు ఏఐఎల్‌ఏ ఆందోళన వ్యక్తం చేసింది. తాము సేకరించిన కేసుల నివేదికలలో 86 శాతం కేసులు ఏదో ఒక స్థాయిలో పోలీసులతో సంప్రదింపులకు నోచుకున్నాయని, 33 శాతం వీసాలు రద్దయిన కేసులలో అభియోగాలు నమోదు చేయకపోవడం, వారిపై కేసులు పెట్టడం లేదని ప్రకటన తెలిపింది.

గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన జోన్‌లో 70 కిలోమీటర్ల వేగంతోడ్రైవ్‌ చేయడం, చట్టవిరుద్ధంగా వాహనం పార్కింగ్‌ చేయడం, సీటు బెల్టు ధరించకపోవడం, నెంబర్‌ ప్లేట్లు గడువు తీరిపోవడం వంటి చిన్న చిన్న అభియోగాలతో పోలీసుల నుంచి ఓపీటీ విద్యార్థులకు నోటీసులు అందాయి. వీసా రద్దుకు గురైన విద్యార్థులలో ఇద్దరు విద్యార్థులకు మాత్రమే రాజకీయ నిరసనలలో పాల్గొన్న చరిత్ర లేదని ఏఐఎల్‌ఏ తెలిపింది. వీసా రద్దుకు సంబంధించిన ఈమెయిర్‌ నోటీసులు అందుకున్న మెజారిటీ విద్యార్థులకు ఈ నోటీసు వీసాను మంజూరు చేసిన కాన్సులేట్‌ నుంచి వచ్చినట్లు ఏఐఎల్‌ఏ పేర్కొంది. 

 today-latest-news-in-telugu | usa | student-visa

Also Read: Danish Kaneria: ఉగ్రదాడిలో ప్రమేయం లేకపోతే..పాక్ ఎందుకు ఉలికిపడుతోంది..డానిష్ కనేరియా

Advertisment
Advertisment
Advertisment