Health Tips: సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారా? ఈ సమస్యలు తప్పదు..! మీరు బయటకు వెళ్లేటప్పుడు షూ వేసుకుంటున్నారా? అయితే, సాక్సులు లేకుండానే ఆ షూ ని వేసుకుంటున్నారా? మీకోసం ఈ షాకింగ్ న్యూస్. సాక్సులు లేకుండా షూ వేసుకునే వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది ఓ పరిశోధన సంస్థ. సాక్సులు లేకుండా షూ వేసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని స్టడీలో వెల్లడించింది. అంతేకాదు.. చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయని, రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని స్టడీ పేర్కొంది. By Shiva.K 22 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Wearing Shoes with out Socks: ప్రస్తుత టెక్ యుగంలో సాంకేతికత పరమైన అంశాలు మాత్రమే కాదు, మనం తినే, తాగే, దుస్తులు, పాదరక్షలు ధరించే విధానం కూడా మారిపోయింది. మన ఫ్యాషన్ ట్రెండ్స్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు కాలంలో బెల్ బాటమ్ ప్యాంటు ట్రెండ్ ఎప్పుడైతే మొదలైందో, ఆ తర్వాత టైట్ జీన్స్ ప్రజల జీవనశైలిలో అలవాటుగా మారిపోయింది. అదేవిధంగా షూల ఫ్యాషన్ ట్రెండ్ కూడా వచ్చింది. ప్రస్తుతం చాలా మంది సాక్స్ లేకుండానే బూట్లు ధరిస్తఉన్నారు. కొందరైతే.. చిన్న సాక్స్ ధరించడానికి ఇష్టపడతారు. అయితే మీరు కూడా సాక్స్ లేకుండా సాక్స్ వేసుకుంటున్నారా? ఈ వార్త మీకోసమే. సాక్స్ లేకుండా బూట్లు ధరించడం ఆరోగ్యానికి హానికరం అని తాజా పరిశోధనలో తేలింది. దీని వల్ల పాదాలే కాదు శారీరక ఆరోగ్యానికి సంబంధించిన ఇతర వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. Also Read: విశాఖలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. యువకుడు స్పాట్ డెడ్.. పాదాలకు చెమట.. తాజా పరిశోధనలో ఒక వ్యక్తి పాదాల నుంచి రోజుకు 300 మి.లీ చెమట వస్తుంది. సాక్స్ లేకుండా షూ వేసుకుంటే ఈ చెమట ఎండిపోదు. ఫలితంగా పాదాలలో తేమ పెరుగుతుంది. అదికాస్తా పాదాలలో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. సాక్స్ లేకుండా షూ వేసుకుంటే ఈ సమస్యలు రావచ్చు.. అలర్జీ: కొందరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో.. లెథర్, మరేదైనా సింథటిక్ పదార్థంతో తయారు చేసిన షూ వేసుకోవడం వలన అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పదార్థాలతో తయారు చేసిన బూట్లు ధరించేవారు తప్పకుండా సాక్సులను ధరించాల్సి ఉంటుంది. రక్త ప్రసరణ: సాక్సులు లేకుడా షూ ధరించడం వలన రక్త ప్రసరణలో సమస్యలు తలెత్తుతాయని సర్వేలో పేర్కొన్నారు. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం అని చెబుతున్నారు నిపుణులు. సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలకు హాని జరగడమే కాకుండా రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. పరిష్కారం ఏంటి? ఏదైనా షూ వేసుకునే ముందు.. మీకు ఏ షూ సరైనదో గుర్తించాలి. బిగుతుగా లేదా వదులుగా ఉండే బూట్లు ధరించవద్దు. షూ వేసుకునే ముందు మంచి నాణ్యమైన సాక్స్‌లను ధరించాలి. వాటిని ప్రతిరోజు ఉతికిన తరువాతే వినియోగించాలి. ఒక రోజు కంటే ఎక్కువ సాక్స్ ధరించవద్దు. Also Read: ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం.. మిషన్ గగన్‌యాన్‌లో తొలి ప్రయోగం #health-tips #health-news #socks #shoes #wearing-shoes-with-out-socks మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి