Health Tips: మండే ఎండల నుంచి రక్షణగా ఈ టిప్స్ పాటించండి రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వేడి వాతావరణంలో.. శరీరానికి తగినంత నీటిశాతం ఉండేలా చూసుకోవాలి. తరచూ పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. కాఫీలు తగ్గించాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. By B Aravind 09 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి వేసవి కాలం మొదలైపోయింది. రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్లు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వేడి వాతావరణంలో.. శరీరానికి తగినంత నీటిశాతం ఉండేలా చూసుకోవాలి. తరచు పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. కాఫీలు తగ్గించాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. Also Read: ఈ బ్రీడ్స్ పెంపుడు కుక్కలపై నిషేధం.. లిస్ట్ ఇదే! వృద్ధుల్లో గుండె, కిడ్నీల సమస్యలు ఉన్నవారు.. నీటిని పరిమిత స్థాయిలో తీసుకునే పరిస్థితిలో ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే ఉండటం మంచిది. గాలి తగిలేలా వదులు దుస్తులు వేసుకోవాలి. తప్పనిసరి బయటికి వెళ్లాల్సి వస్తే గొడగు వెంట తీసుకెళ్లడం మంచింది. మధ్నాహ్నం పూట ఏసీ లేదా కూలర్ వాడాలి. ఇవి లేని వాళ్లు గదిలో ఫ్యాన్‌గాలి ఉండేలా చూసుకోవాలి. తడి టవల్‌ను వాడటం వల్ల ఫ్యాన్ నుంచి వచ్చే వేడిగాలి కొంత చల్లారుతుంది. బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు వదులుగా ఉండే దుస్తులు, లేత రంగలు దుస్తులు ధరించాలి. మీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అలాగే ఆహార విషయంలో కూడా నిపుణుల సలహాలు, సూచనలు పాటించండి. మసాలాలు ఉండే పదార్థాలు తగ్గించండి. వడదెబ్బకు గురైనట్లు అనిపించినా.. ఒంట్లో కలవరపాటుగా ఉన్నా ఆలస్యం చేయకుండా వైద్యుని వద్దకు వెళ్లాలి. Also Read: మట్టి కుండలో నీళ్లు తాగితే.. ఏమవుతుందో తెలుసా..! #telugu-news #health-tips #summer #high-temperature మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి