Health Tips: మోకాళ్లు, కీళ్ల నుంచి సౌండ్ వస్తోందా? కారణమిదేనట..!

మోకాళ్ల నుండి వచ్చే 'కట్, కట్' శబ్దాన్ని ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా అనుకుంటారు. వాస్తవానికి ఈ శబ్ధాలకు సైనోవియల్ ద్రవం లోపమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా ఇలాంటి సమస్య ఎదుర్కొంటే వెంటనే వైద్యులకు చూయించుకోవాలి.

New Update
Health Tips: మోకాళ్లు, కీళ్ల నుంచి సౌండ్ వస్తోందా? కారణమిదేనట..!

Joint Pain Causes and Treatment: మోకాలి కీళ్ల నుంచి పగిలిన శబ్దం చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది తీవ్రమైన సమస్యకు నాంది అని కొందరు అంటుంటారు. మోకాలు దెబ్బతినడానికి ఇదే మొదటి సంకేతమని మరికొందరు భావిస్తారు. దీని కారణంగానే మోకాలు, కీళ్ల నుండి శబ్దం వస్తుందని చెబుతారు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు మోకాళ్ల నుండి శబ్దం చేస్తే ఆందోళనకు గురవుతారు. ఈ శబ్ధం విని ఇతరులు కూడా సెటైర్లు వేస్తారు. ఇక మీరు వృద్ధులయ్యారని పంచ్‌లు వేస్తుంటారు. కానీ, ఈ శబ్ధం రావడం వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? ఈ శబ్ధం ఎందుకు వస్తుంది? ఏ సమయంలో వస్తుంది? పూర్తి వివరాలను ఇవాళ మనం తెలుసుకుందాం..

వయసు, మృదులాస్థి లేకపోవడం..

ఒక వ్యక్తి మోకాలి నుండి శబ్దం వస్తే.. కీళ్లలో నొప్పి, వాపు లేనట్లయితే.. ఇది సాధారణమైన సమస్యగా పరిగణించబడుతుంది. వాస్తవానికి, కీళ్ల లోపల ఒక ద్రవం ఉంటుంది. ఇది వాయువును కలిగి ఉన్న సైనోవియల్ ద్రవం. మోకాళ్ల నుంచి వచ్చే శబ్దం వెనుక వయసు పెరగడం కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ కీళ్లలోని మృదులాస్థి సరిగా పనిచేయదు. చాలా సార్లు మోకాళ్లలో ఏదైనా గాయం ఏర్పడితే, అది నేరుగా మృదులాస్థిని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా మోకాళ్ల నుండి శబ్దం రావడం ప్రారంభమవుతుంది.

కీళ్లు, మోకాళ్ల నుంచి శబ్ధం రావొద్దంటే ఏం చేయాలి?

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. కానీ, ఆ ఆరోగ్యం కోసం చేయాల్సిన పనులు మాత్రం చేయరు. మొకాళ్లు, కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే.. కొన్ని చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజూవారి వ్యాయామం, మంచి ఆహారం తినడం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చేయాలని సూచిస్తున్నారు. మంచి ఆహారం తింటే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. అలాగే ఆహారంలో పోషకాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విటమిన్లు, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలు, కూరగాయలను ఎక్కువగా తినాలి. గుడ్లు, పాలు, పెరుగు, చేపలు ఎక్కువగా తినాలి. ఇవి ఎముకల బలంగా ఉండేలా చూస్తాయి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని RTV ధృవీకరించడం లేదు. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే.. వైద్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనల మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Also Read:

పాలమూరు బరిలో కోటీశ్వరులు.. ఎవరి ఆస్తులు ఎంతంటే..!

‘వారిని బూటుతో కొట్టాలి’ అంటూనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు..

Advertisment
Advertisment
తాజా కథనాలు