సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం.. హరీష్ రావు సీరియస్ రియాక్షన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అత్యాచార ఘటనపై హరీష్ రావు స్పందించారు. హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. By Seetha Ram 15 Oct 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి రోజు రోజుకూ కామాంధుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. చిన్నా పెద్దా.. తల్లి చెల్లి అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. పండు ముసలివాళ్లను సైతం వదలడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు పెట్రేగిపోతున్నారు. ఈ మధ్య ఈ వ్యవహారం మరింత ఎక్కువైపోయింది. తాజాగా అలాంటి దారుణమైన ఘటన మరొకటి జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ యువతిపై ఇద్దరు కామాంధులు రెచ్చిపోయారు. ఒంటరిగా ఉండటంతో ఆటోలో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చదవండి: మద్యం షాపులకు లాటరీ.. ఎన్నో చిత్ర విచిత్రాలు బాబోయ్, ఆశ్చర్యపోతారు! సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అర్థరాత్రి ఆర్‌సీపురం దగ్గర ఆటో ఎక్కి 2:30 సమయంలో మసీద్ బండ ప్రాంతంలో దిగింది. దీంతో ఆ చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించిన ఆ ఆటో డ్రైవర్, అలాగే మరో యువకుడు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. వెంటనే బాధితురాలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు! కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని.. నేరాల రేటు కూడా గణనీయంగా పెరిగిందని మండిపడ్డారు. హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి.కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయి. నేరాల రేటు గణనీయంగా పెరిగింది.రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నా… — Harish Rao Thanneeru (@BRSHarish) October 15, 2024 ఇది కూడా చదవండి: ఏపీలోని మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. రేపటి నుంచే..! రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏ ఒక్క నాడు సమీక్ష చేయడం లేదని తెలిపారు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం అని ఫైర్ అయ్యారు. ఇది కూడా చదవండి: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. వారందరికీ గుడ్ న్యూస్.. వివరాలివే! అత్యాచార బాధితురాలికి భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. #telangana-crime #crime #gachibowli మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి