Guntur Kaaram : గుంటూరు కారం వివాదాల ఘాటు.. మరి.. బాక్స్ ఆఫీస్ లో తన ఘాటు చూపిస్తుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదాలకు దూరంగా ఉంటారు.ఆయనలాగే ఆయన నటించిన సినిమాలు కూడా వివాదరహితంగానే ఉంటాయి . కానీ .. గుంటూరు కారం విషయంలో మాత్రం లెక్కలేనన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి.

New Update
Guntur Kaaram : గుంటూరు కారం వివాదాల ఘాటు.. మరి.. బాక్స్ ఆఫీస్ లో తన ఘాటు చూపిస్తుందా?

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ,త్రివిక్రమ్ (Trivikram ) కాంబోలో తెరకెక్కుతోన్న అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. అతడు , ఖలేజా లాంటి హిట్ చిత్రాల తరువాత దాదాపు పదేళ్ల తరువాత వస్తోన్న కాంబో కాబట్టి గుంటూరు కారం మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి.2022 ఫిబ్రవరి నెలలో గుంటూరు కారం మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలు స్టార్ట్ కాగా తర్వాత సెప్టెంబర్ నెలలో మహేష్ తల్లి ఇందిర గారు మరణించడం జరిగింది.ఆ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అయినా కొద్ది రోజులకు డిసెంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ మరణించడం జరిగింది.
దీంతో అనేక వాయిదాల పడుతూ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో మొదట హీరోయిన్ అనుకున్న (Pooja Hegde) పూజ హెగ్డే ను రీప్లేస్ చేస్తూ సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. ఆ తరువాత ఈ సినిమా ఛాయాగ్రాహకుడు ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఇలా మొదట్లోనే ఈ సినిమా వివాదాలతో మొదలైంది. ఆతరువాత ఇందులో రెండో కథానాయికగా వున్న శ్రీలీలనే (Sreeleela) మెయిన్ హీరోయిన్గా చేశారు, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ని సెకెండ్ హీరోయిన్ గా చేశారు. ఇదిలా ఉంటే మళ్ళీ ఈ సినిమా మధ్యలో షూటింగ్ కొన్ని కారణాల వలన ఆగిపోయింది.

ఫ్యాన్స్ ను కోతులతో పోల్చిన నిర్మాత

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను ఈ సినిమా నుంచి తప్పిస్తున్నారని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి . ఆ తరువాత మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. స్టార్ట్ అయి ఇన్నాళ్లయినా ఈ మూవీ నుంచి ఒక్క అప్డేట్ లేదని ఫ్యాన్స్ గోల చేశారు. వాటికి కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక.. ఈ మూవీ నుంచి మరో వివాదం కూడా వచ్చింది.ఆ మధ్య రిలీజయిన 'ఓ మై బేబీ' #OhMyBaby పాటపై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ పాట మహేష్ బాబు ఫ్యాన్స్కు సరిగ్గా ఎక్కలేదు. దీని మీద మహేష్ ఫ్యాన్స్ తమన్ ని, రామజోగయ్య శాస్త్రిని ట్రోల్ చేశారు, రామజోగయ్య గారు వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని అభిమానులకి వార్నింగ్ ఇచ్చారు. అతన్ని మళ్ళీ ట్రోల్ చేశారు, అతను తన ఎక్స్ (ట్విట్టర్) ఆకౌంట్ ని తీసేసారు.పోనీ అక్కడితో అయిపోయిందా అంటే, ఆ సినిమా నిర్మాత నాగ వంశి అభిమానులను కోతులతో పోల్చాడు. ఒక సినిమా నిర్మాత అయిన నాగవంశీ ఒక సూపర్ స్టార్ అభిమానులని కోతులతో పోల్చడం ఏంటి అని మళ్ళీ అతన్ని ట్రోల్ చేశారు. మరి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత పెద్ద సినిమా ఒక సూపర్ స్టార్ తో తీసినప్పుడు, పాటలు అభిమానులకి నచ్చేలా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా అని అడుగుతున్నారు సాంఘీక మాధ్యమంలో. (Naga Vamsi) నోరు జారడం, మళ్ళీ దానికి ఇంకో మాట అనడం సినిమా సెలబ్రిటీస్ కి అలవాటే కదా, నోరు జారినందుకు మళ్ళీ ఇంకో సమాధానం కూడా పెట్టారు నిర్మాత.నేను చెప్పిన సమాధానానికి మీరు హర్ట్ అయి వుంటారు కదా, మరి మీరు ట్రోల్ చేస్తున్నప్పుడు మేము అంతే హర్ట్ అవుతాం కదా అన్నట్టుగా వచ్చే సమాధానం ఇచ్చి, జనవరి 12 వరకు ఓపిక పట్టండి అని చెప్పారు నిర్మాత తన ఎక్స్ (ట్విట్టర్) లో.

కాదేదీ సినిమా పాటకు అనర్హం

సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న ఈ రోజుల్లో ఎక్కడ ఏ మాట పాపులర్ అయినా సరే .. ఆ మాటను సినిమాల్లో డైలాగ్స్ రూపంలోనో , లేదా పాట రూపంలోనో వాడుకోవడం ఆనవాయితీ అయిపోయింది. ఈ క్రమంలో గుంటూరు కారం మూవీ నుంచి రీసెంట్ గా రిలీజయిన మాస్ బీట్ ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ నెట్టింట్లో రచ్చ చేసిన విషయం తెల్సిందే. కుర్చీ మడతపెట్టి అంటూ మొదలైన ఈ సాంగ్ లిరిక్స్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కుర్చీ మడతపెట్టి అనేది ఒక బూతు డైలాగ్. ఏదో ఒక యూట్యూబ్ ఛానెల్ లో ఒక ముసలి వ్యక్తి చెప్పగా ఫేమస్ అయిన పదాన్నిమా హీరో పాటలో పెట్టడం ఎంతవరకు సమంజసం.. మా హీరో ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దంటూ అంటూ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి , మ్యూజిక్ డైరెక్టర్ థమన్లపై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ వివాదాహం ఎలాగోలా సద్దుమణిగింది .

కుర్చీ మడత పెట్టి పాట ట్యూన్ కాపీ?

థమన్ ట్యూన్స్ అంటే కాపీ ట్యూన్స్ అనే రిమార్క్ ఉంది. ఇప్పుడు కుర్చీ మడత పెట్టి (Kurchi Madathapetti) పాట ట్యూన్ కూడా అత్తారింటి దారేది మూవీలో బేట్రాయి సాంగ్ కాపీ అనే ట్రోల్స్ నడుస్తున్నాయి. మరి.. ఈ వివాదాం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి .ఓవరాల్ గా చూసుకుంటే గుంటూరు కారం మూవీ కి వివాదాల ఘాటు ఎక్కువయింది.

జనవరి 12 సంక్రాంతి బరిలో గుంటూరు కారం

అన్ని అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు ఈ సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధం అయింది. జనవరి 12 న థియేటర్స్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. సినిమా మొదలయినప్పటినుంచి నేటివరకు ఎన్నో వివాదాలు .గతంలో త్రివిక్రమ్ కెరీర్లో కానీ , మహేష్ బాబు కెరీర్ లో కానీ ఎప్పుడూ వివాదాలు చోటుచేసుకోలేదు.

వివాదాలు సరే .. విజేతగా నిలుస్తుందా ?

గుంటూరు కారం విషయంలో వివాదాల ఘాటు మాములుగా లేదు. మరి.. ఈ ఘాటు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ కాస్త టెన్షన్ లో ఉన్న మాట వాస్తవమే. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్స్ , పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండటంతో సక్సస్స్ పై చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్..ఈ చిత్ర నిర్మాత నాగ వంశీ అయితే కలక్షన్ల పరంగా రాజమౌళి సినిమాలకు ధీటుగా ఉంటుందని ఇటీవల జరిగిన ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. చూడాలి మరి.. గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద ఘాటు ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మరికొద్హిరోజులు ఆగాల్సిందే.

ALSO READ:DJ Tillu Square:డీజే టిల్లు స్క్వేర్ క్రేజీ పోస్టర్.. వామ్మో అనుపమ .. ఈ రేంజ్ రొమాన్సా !!

Advertisment
Advertisment
తాజా కథనాలు