Maharashtra: బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో కాల్పులు..ఒకరికి గాయాలు

మహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. అక్కడ ప్లాట్ ఫామ్ వన్‌లో ఒక వ్యక్తి కాల్పులు చేశాడు. దీంట్లో ఒకరికి గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు దుండుగుడిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Mali: దారుణం..దుండగుల కాల్పుల్లో 26 మంది మృతి!

Gun Firing In badlapur Railway Station: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో ఈరోజు సాయంకాలం జరిగిన కాల్పులు భయభ్రాంతులను కలిగించాయి. గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. దుండగుడు మరిన్ని కాల్పులు జరిపే లోపు వెంటనే అప్రమత్తమయిన పోలీసులు అతడిని లొంగదీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే నిందితుడు కాల్పులు ఎందుకు జరిపాడు, అతను ఎవరు అన్న వివరాలు ఇంకా తెలియలేదు. ఇది కేవలం వ్యక్తిగత కక్షా లేక దీని వెనుక ఉగ్రవాద కోణం ఏమైనా ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ రైల్వే) సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Also Read: Paris: భారత్‌ ఖాతాలో 25వ పతకం..జూడోలో కాంస్యం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది.

New Update
Punjab Kings batsman Shreyas Iyer scored 82 runs in the match against Sunrisers