Pizza: తియ్యతియ్యగా గులాబ్‌జామ్ పిజ్జా..వైరల్ అవుతున్న వీడియో

ప్రపంచంలో చాలా రకాల పిజ్జాలున్నాయి. కానీ మీరు ఎప్పుడైనా గులాబ్‌జామ్‌ పిజ్జా గురించి విన్నారా...అది ఎలా ఉంటుందో చూశారా? ఏంటీ గులాబ్‌జామ్‌ పిజ్జానా అని ఆశ్చర్చపోతున్నారా..అలాంటి కాంబినేషన్ ఎలా చేస్తారు అని వింతపతోన్నారా...అయితే ఇది మీరు కచ్చితంగా చూసేయాలి, చదివేయాలి.

New Update
Pizza: తియ్యతియ్యగా గులాబ్‌జామ్ పిజ్జా..వైరల్ అవుతున్న వీడియో

Sweet Pizza: పిజ్జా...ఇటలీ పుట్టీ...ప్రపంచమంతా ఫేమస్ అయిన వంటకం. ఇప్పుడు ప్రతీ చోటా ఇది దొరుకుతుంది. ఇందులో చాలా వెరైటీలు కూడా దొరకుతున్నాయి. అలాగే ఫ్యూజన్స్ కూడా చేస్తున్నారు. ఇండియనైజ్‌డ్‌ పీజాలతు అయితే కొదువే లేదు. చెఫ్‌లు పిజ్జాల మీద చేసిననన్ని ప్రయోగాలు ఇంకెందులోనూ చేయలేదేమో. ఇదే విధండి ఇప్పుడు మరో కొత్త పిజ్జాను తయారు చేస్తున్నారు. అదే గులాబ్‌జామ్ పిజ్జా.

తియ్య తియ్యని వేడుక చేసుకుందాం..
భారతీయ స్వీట్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయినది గులాబ్ జామ్. ప్రపంచ వ్యాప్తంగా దీని టేస్ట్‌కు ఫిదా అయ్యారు. అందుకే ఇప్పుడు గులాబ్‌జామ్‌ను, పిజ్జాను కలిపారు. పిజ్జా కారంగా ఉంటుంది. మరి దాని మీద గులాబ్‌జామ్‌ ఏంటి అనుకుంటున్నారా..అందుకే మొత్తం పిజ్జానే మార్చేశారు. గులాబ్‌జామ్‌తో స్వీట్ పిజ్జా తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.

పిజ్జా తయారీ...

అన్ని పిజ్జాలకు ఉండేటట్టే...దీనికి బేస్ ఉంటుంది. కానీ తరువాత వేసే పదార్ధాలే మారతాయి. పిజ్జా బేస్‌ మీద టమాటా సాస్‌కు బదులు గులాబ్ జామ్‌లో ఉండే సుగర్ సిరప్ వేశారు. దాని తరువాత గులాబ్‌జామ్‌ పీసెస్...ఆపైన చీజ్ వేసి బేక్ చేస్తున్నారు. మొత్తం బేక్ అయ్యాక పైన మళ్ళీ గులాబ్‌జామ్‌ను టాపింగ్స్‌లా డెకొరేట్ చేసి ఇస్తున్నారు. చూడ్డానికి అయితే ఈ స్వీట్ పిజ్జా యమ్మీగా ఉంది. మరి తింటే ఎలా ఉంటుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Foodler (@realfoodler)

వీడియో వైరల్..

ఈ స్వీట్ గులాబ్‌జామ్ పిజ్జా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొంతమంది వావ్‌ వాట్ ఏ ఇన్నేవేషన్ అంటుంటే...మరి కొందరు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని కామెంట్లు చేస్తున్నారు. క్రియేటివిటీ మరీ పీక్స్ వెళిపోతోందని రాస్తున్నారు. మరికొందరేమో ఎలాంటివిచూడాల్సి వస్తోందని తలలు కొట్టుకుంటున్నారు. కానీ గులాబ్‌జామ్ పిజ్జా వీడియోకు ఇప్పటి వరకు 2 లక్షల 20 వేల వ్యూస్ వచ్చాయి.

Also Read:Andhra Pradesh : ఆర్జీవీ తెర మీద వ్యూహం.. నిజమవుతోందా?

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment