/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/GST-Collections-jpg.webp)
వస్తు సేవల పన్ను అంటే GST ద్వారా(GST Collections) ఏప్రిల్ 2024లో ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ నెలలోనైనా వసూలు చేసిన అత్యధిక జీఎస్టీ వసూళ్లు ఇదే. మునుపటి (GST Collections)అత్యధిక వసూళ్లు రూ. 1.87 లక్షల కోట్లు, ఇది ఏప్రిల్ 2023లో జరిగింది. అంటే సరిగ్గా సంవత్సరం తరువాత రికార్డ్ బ్రేక్ అయింది. స్థూల జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 12.4% పెరిగాయి. కాగా, గత నెలలో అంటే మార్చి 2024లో జీఎస్టీ వసూళ్లు(GST Collections) రూ. 1.78 లక్షల కోట్లు. అంటే నెలవారీగా వసూళ్లలో 18% పెరుగుదల ఉంది. 18 వేల కోట్ల విలువైన రీఫండ్‌లను ప్రభుత్వంఈ నెలలో జారీ చేసింది. రీఫండ్‌ల తర్వాత, ఏప్రిల్ 2024లో నికర GST ఆదాయం ₹1.92 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది అంటే ఏప్రిల్ 2023తో పోలిస్తే 17.1% ఎక్కువ.
Also Read: ట్రెండ్ రివర్స్.. వెనక్కి తగ్గిన ఫారిన్ ఇన్వెస్టర్స్.. ఎందుకంటే..
CGST రూ. 43,846 కోట్లు, SGST రూ. 53,538 కోట్లు..
ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించిన లెక్కల ప్రకారం, ఏప్రిల్‌కు ₹ 2,10,267 కోట్ల GST వసూళ్లు, CGST రూ. 43,846 కోట్లు అలాగే, SGST రూ. 53,538 కోట్లు(GST Collections). IGST రూ. 99,623 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 37,826 కోట్లు కలిపి) అదే విధంగా సెస్ రూ. 13,260 కోట్లుగా ఉంది. సెస్‌లో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చిన రూ.1008 కోట్లు ఉన్నాయి.
GST సేకరణ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది
ఏప్రిల్ నెల GST వసూళ్ల (GST Collections)గణాంకాలపై KPMG నేషనల్ హెడ్ అభిషేక్ జైన్ మాట్లాడుతూ, ఇప్పటివరకు అత్యధిక GST వసూళ్లు బలమైన దేశీయ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తాయని అన్నారు.
GST 2017లో మొదలు అయింది..
GST అనేది పరోక్ష పన్ను. దీనిని మునుపటి పరోక్ష పన్నులు (VAT), సేవా పన్ను, కొనుగోలు పన్ను, ఎక్సైజ్ సుంకం అలాగే, అనేక ఇతర పరోక్ష పన్నులను భర్తీ చేయడానికి 2017లో అమలులోకి తీసుకువచ్చారు. GSTలో 5, 12, 18 - 28% నాలుగు శ్లాబులు ఉన్నాయి.