Gruha Jyothi : 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌.. గృహజ్యోతి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్!

నెలవారీ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి లబ్ధిదారుల గుర్తింపు కోసం తెలంగాణ ఇంధన శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి మీటర్‌ రీడర్లు ఇంటింటికి వస్తారు. గృహ జ్యోతి పథకంలో చేరాలనుకునే వారు తమ తెల్లరేషన్ కార్డులు, ఆధార్ కార్డులను వారికి చూపించాలి.

New Update
Gruha Jyothi : 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌.. గృహజ్యోతి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్!

Gruha Jyothi Implementation : తెలంగాణ(Telangana) లో గృహజ్యోతి పథకం(Gruha Jyothi Scheme) అమలుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. గ్రేటర్‌లో ఇవాళ్లి నుంచే గృహజ్యోతి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ కానున్నాయి. వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌(Free Current) ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ప్రతి నెల మొదటివారంలో 10రోజుల పాటు.. మీటర్‌ రీడింగ్‌తో పాటు లబ్ధిదారుల గుర్తింపు ఉంటుంది. మీటర్‌ రీడింగ్‌(Meter Reading) తీసే సిబ్బందితోనే లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్‌(Revanth Sarkar). మీటర్‌ రీడర్‌కు రేషన్‌, ఆధార్‌ కార్డ్‌ నంబర్లతో పాటు, మొబైల్‌ నంబర్‌ లింక్ చేస్తారు. రీడింగ్‌ కోసం తెచ్చిన హ్యాండ్‌ హెల్త్‌ మెషీన్‌లో ఎంట్రీ చేస్తారు.

డేటాలో తప్పు నమోదు లేదా అసంపూర్తిగా లేదా డేటా అందుబాటులో లేకుంటే, మీటర్ రీడర్లు వినియోగదారులు సమర్పించిన డేటాను రికార్డ్ చేస్తారు. డేటా భాగస్వామ్యం స్వచ్ఛందంగా ఉంటుంది. వినియోగదారులు డేటాను భాగస్వామ్యం చేయడానికి నిరాకరించవచ్చు. సమాచారాన్ని పంచుకున్న వారి అర్హతను అంచనా వేసి, ఆపై వారిని గృహ జ్యోతి పథకం కిందకు తీసుకువస్తారు.

Also Read : బంగారం కొంటారా? రేటు తగ్గింది.. వెండి కూడా తగ్గింది.. ఎంతంటే..

కర్ణాటక అధికారులతో భేటీ:
గృహజ్యోతి పథకం గురించి పూర్తి అవగాహన కోసం తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ అధికారులు కర్ణాటకలోని తమ అధికారులతో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TSSPDCL), ఛైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీతో సహా అధికారులు బెంగళూరులో బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ (బెస్కామ్) మేనేజింగ్ డైరెక్టర్ మహతేష్ బిలాగి, డైరెక్టర్ ఫైనాన్స్ ధర్షన్ జెతో భేటీ అయ్యారు. బెస్కామ్‌తో పాటు ఇతర ఇంధన శాఖ అధికారులు పంజాబ్, ఢిల్లీ, తమిళనాడులో అందిస్తున్న పథకాలను అధ్యయనం చేశారు. గృహ జ్యోతి కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే సొంత పథకాన్ని రూపొందించింది తెలంగాణ సర్కార్‌. కొన్ని అట్టడుగు వర్గాలకు అదనంగా 10 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది.

Also Read: ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు