అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్‌.. వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మీర్‌పేటలో గంజాయి గ్యాంగ్‌ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అడ్డు వచ్చిన బాలిక అన్నయ్యను కత్తితో బెదిరించి తన ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. కాగా మీర్‌పేట ఘటనపై గవర్నర్‌ తమిళి సై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో వివరణ కావాలని డీజీపీ, సీఎస్, రాచకొండ సీపీ ఆదేశించారు.

New Update
అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్‌.. వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని మీర్‌పేటలో ముగ్గురు కామాంధులు మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. గంజాయి మత్తులో బాలిక ఇంటికి వెళ్లిన యువకులు.. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అడ్డు వచ్చిన బాలిక అన్నయ్యను కత్తితో బెదిరించారు. బాధితురాలి సొదరుడు ఎటు వెళ్లకుండా మెడపై కత్తిపెట్టి తన ముందే అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక అరుపులు విన్న స్థానికులు అక్కడి వెళ్లే సరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. నిందితుల కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు మీర్‌పేటలో జరిగిన హత్యాచార ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ స్పందించారు. 16 ఏళ్ల బాలికపై కామాంధులు అఘాయిత్యానికి పాల్పడంపై ఆమె దిగ్భాంతి వ్యక్తం చేశారు. దీనిపై తనకు వివరణ ఇవ్వాలని గవర్నర్‌ సీఎస్, డీజీపీ, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ నివేదిక 48 గంటల్లో అందించాలన్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాకు చెందిన రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు వెంటనే బాధితురాలి ఇంటికి వెళ్లి, ఆమె కుటుంబానికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలన్నారు.

కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. అఘాయిత్యాలు ఆగడం లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట యువతులపై కామాంధులు దాడి చేస్తూనే ఉన్నారు. మానవ మృగాల నుంచి యువతులను కాపాడటానికి ప్రభుత్వం గతంలో షీ టీమ్‌లను ఏర్పాటు చేయగా.. అప్పుడు నేరాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ షీటీమ్‌ బృందాలు గ్రామ స్థాయిలోకి వెళ్లకపోవడంతో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం షీటీమ్స్‌ బృందాలను ప్రతీ పల్లెటూర్లోకి పంపి తమకు ప్రమాదం ఉందని తెలిసిన సమయంలో యువతులు ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు