Jobs: మెడికల్ కాలేజీల్లో 4,356 ఉద్యోగాలు...ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?

తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తోంది. వరుసపెట్టి అన్ని డిపార్ట్‌మెంట్‌లో జాబ్ నోటిఫికేషన్స్ పడుతున్నాయి. ప్రభుత్వం వరుసపెట్టి ఉద్యోగాలకు కాల్ చేస్తోంది తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

New Update
Jobs: మెడికల్ కాలేజీల్లో 4,356 ఉద్యోగాలు...ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?

Jobs In Medical Colleges: తెలంగాణలో మళ్ళీ భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది. ఏకంగా 4,356 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆరోగ్యశాఖ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వీటిని భర్తీ చేయనున్నారు.

పోస్టులు..

మొత్తం 4,356 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది ఆరోగ్యశాఖ. ఇందులోప్రొఫెసర్- 498 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్ - 786పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 1459 పోస్టులు
ట్యూటర్ - 412 పోస్టులు
సీనియర్ రెసిడెంట్స్ - 1,201 పోస్టులు ఉన్నాయి.

జీతం..

ఈ ఉద్యోగాలన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. జీతం రూ.55 వేల నుంచి రూ.1.90 లక్షల వరకు ఇవ్వనున్నారు.

ఇంటర్వ్యూ, అర్హత..

సంబంధించిన డిపార్ట్‌మెంట్‌లో ఎంబీబీఎస్, పీజీ చేసి ఉండాలి. ఈ నెల 16న జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మరిన్ని వివరాల కోసం dme.telangana.gov.in/లో చూడవచ్చును.

Also Read:Agni-5:మిషన్ దివ్యాస్త్ర వెనుక హైదరాబాద్ మహిళా శాస్త్రవేత్త

Advertisment
Advertisment
తాజా కథనాలు