Bengaluru: బెంగళూరులో ట్రాఫిక్‌.. కారులో కంటే నడుచుకుంటూ వెళ్తేనే బెస్ట్‌ !

బెంగళూరు ట్రాఫిక్‌ గురించి గూగుల్ మ్యాప్స్‌ చూపించిన అంశం వైరల్ అవుతోంది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే.. నడుస్తూ త్వరగా చేరుకోవచ్చని దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ ఫొటో ఓ వ్యక్తి ఎక్స్‌లో చేశాడు.

New Update
Bengaluru: బెంగళూరులో ట్రాఫిక్‌.. కారులో కంటే నడుచుకుంటూ వెళ్తేనే బెస్ట్‌ !

కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. ఇక వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతాయి. అయితే తాజాగా బెంగళూరు ట్రాఫిక్‌ గురించి గూగుల్ మ్యాప్స్‌ చూపించిన అంశం నెట్టింటా వైరల్ అవుతోంది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే.. నడుస్తూ త్వరగా చేరుకోవచ్చని గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపించింది. ఈ విషయాన్ని ఆయుష్ సింగ్‌ అనే ఓ వ్యక్తి దాని స్ర్కీన్‌షాట్‌ను ఎక్స్‌లో షేర్ చేశాడు.


Also Read: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు

ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులో కేఆర్‌పురం రైల్వే స్టేషన్‌ నుంచి గరుడాచార్‌ పాళ్లలో బ్రిగేడ్ మెట్రోపొలిస్ వరకు ఏదైనా వాహనంలో వెళ్లేందుకు 44 నిమిషాల సమయం పడితే.. అదే దూరం నడిచి వెళ్లేందుకు 42 నిమిషాల సమయం పడుతోందని గూగుల్‌ మ్యాప్స్‌లో సూచించింది. ఇలాంటిది బెంగళూరులో మాత్రమే సాధ్యమవుతోందని ఆయుష్ సింగ్‌ ఎక్స్‌లో షేర్ చేసిన ఈ పోస్టు వైరల్ అవుతోంది. దీనిపై నెటీజన్లు విభిన్నరీతిలో స్పందిస్తున్నారు. భారత్‌కు బెంగళూరు ట్రాపిక్‌ రాజధాని అని.. ముంబై, ఢిల్లీలో కూడా ఇదే రకమైన ట్రాఫిక్ ఉంటుందని చెబుతున్నారు.

Also Read: భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 50 మంది యాత్రికులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vidadala Rajini : మాజీమంత్రికి బిగ్ షాక్....మరిది అరెస్ట్

మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విజయవాడకు తరలించారు. క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని గోపీపై కేసు నమోదైంది.

New Update
Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినితోపాటు గోపీపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అతడ్ని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే


గోపిని  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ ను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
 
కాగా.. మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజని వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. ఆమె మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

Advertisment
Advertisment
Advertisment