Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని.. దట్టమైన అడవిలో చిక్కుకున్న విద్యార్థులు

ఒడిశాలోని కటక్‌లో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు జూన్ 30న సప్తసజ్య అనే ఆలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని ఓ దట్టమైన అడవిలో చిక్కుకుపోయారు. 11 గంటల పాటు నరకయాతన అనుభవించారు. చివరికి పోలీసులు వాళ్లని రక్షించగలిగారు.

New Update
Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని.. దట్టమైన అడవిలో చిక్కుకున్న విద్యార్థులు

Google Maps: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు చాలామంది గూగూల్‌ మ్యాప్స్‌ను వినియోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు దీన్ని నమ్మి దార్లు తప్పిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది నదులు, చెరువులు, కాలువలోకి కూడా దూసుకెళ్లిన ఘటనలు జరిగాయి. అయితే తాజాగా కొంతమంది విద్యార్థులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గుగూల్ మ్యాప్‌ను నమ్ముకొని దారితప్పి దట్టమైన అడవిలో చిక్కుకుపోయారు. 11 గంటల పాటు నరకయాతన అనుభవించారు.

Also Read: ముప్పై ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు.. ఎక్కడంటే

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని (Odisha) కటక్‌లో ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు జూన్ 30న సప్తసజ్య అనే ఆలయానికి వెళ్లారు. బైక్స్‌పై అక్కడికి చేరుకున్నాక తిరుగు ప్రయాణంలో గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని ఓ దట్టమైన అడవిలో చిక్కుకుపోయారు. ఆకలి, దాహం, అలసటతో చాలాసేపు ప్రయత్నించారు. దాదాపు 11 గంటల పాటు అడవిలోనే భయం భయంగా గడిపారు. ఎట్టకేలకు పోలీసులకు సమాచారం అందిచగలిగారు. దీంతో రెస్క్యూ టీం విద్యార్థులను కనిపెట్టి రక్షించింది. అయితే ఆలయానికి వెళ్లాక.. మేమున్న ప్రదేశం నుంచి కొంత దూరంలో అందమైన ప్రదేశం ఉందని తెలుసుకున్నామని అక్కడికి చేరుకునే ప్రయత్నంలో అడవిలో చిక్కుకుపోయామని బాధితులు చెప్పారు.

అలసట, ఆకలి, దప్పికలతో చాలా సేపు సహాయం కోసం ప్రయత్నించారు. అలా 11 గంటల పాటు అడవిలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరికి పోలీసులను సంప్రదించగలిగారు. అప్రమత్తమైన రెస్క్యూ బృందం అడవిలో గాలింపులు చేపట్టి విద్యార్థులను రక్షించింది. ‘‘ఆలయాన్ని సందర్శించిన తర్వాత గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా మేమున్న చోటుకు కొంత దూరంలో అందమైన ప్రదేశం ఉందని తెలుసుకున్నాం. తిరుగుప్రయాణంలో అక్కడికి చేరుకునే ప్రయత్నంలో అడవిలో చిక్కుకుపోయాం’’ బాధితులు పేర్కొన్నారు.

Also Read: నీట్ పై చర్చ జరగాలి.. ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ లేఖ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

గతేడాది వరదల్లో వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని చనిపోయారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు పెట్టి గౌరవించింది. ఆమె తండ్రితో వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ ఆఖేరు వాగు వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

New Update
scientist ashwini

scientist ashwini

వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గుర్తింపు లభించింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గత సంవత్సరం వరదలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆమె తండ్రితోపాటు కారులో ప్రయాణిస్తుండగా ఇద్దరు చనిపోయారు. శాస్త్రవేత్త అశ్విని మృతి చెందినప్పటికీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కొత్తగా రూపొందించిన పూస శనగ 4037 రకానికి వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని పేరు పెట్టి అరుదైన గౌరవం ఇచ్చింది. 

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

ఢిల్లీలో సోమవారం ఈ కొత్త వంగడానికి అశ్విని పేరు పెట్టి విడుదల చేసింది. దివంగత అశ్విని రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో PG, Phd పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఛతీష్‌గడ్ రాజధాని రాయపూర్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించింది. అక్కడ జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆఖేరు వాగు సమీపంలో భారీ వరద ప్రవాహంలో ఆమె ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. హెక్టారుకు 36.4 క్వింటాళ్ల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకానికి IARI నునావత్ అశ్విని పేరు పెట్టడం పట్ల తల్లిదండ్రులు, కారేపల్లి మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also read: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

Advertisment
Advertisment
Advertisment