DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మరో పది రోజుల్లో..

గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్‌లలో 4 శాతం పెంపును ప్రకటించగా.. ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు. దీంతో వారు ఏప్రిల్ జీతంలో సవరించిన వేతనంతో పాటు 3 నెలల బకాయిలను పొందే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

New Update
Telangana: ఉద్యోగులకు శుభవార్త...ఆగస్ట్‌ 15 తరువాత డీఏ ప్రకటన!

Central Government Jobs : గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్‌(DR) లలో 4 శాతం పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఒక వర్గానికి చెందిన ఉద్యోగులు, పెన్షనర్లకు సవరణతో మార్చి నెల వేతనం అందలేదు. దీంతో వారు ఏప్రిల్ జీతంలో సవరించిన వేతనంతో పాటు 3 నెలల బకాయిలను పొందే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు(Government Employees) డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ను అందిస్తారు. జనవరి, జులై నుంచి అమల్లోకి వచ్చేలా ఏడాదికి రెండుసార్లు డీఏ, డీఆర్‌లను పెంచుతారు. అయితే డీఏ పెంపును ప్రకటించిన ప్రభుత్వం.. గత నెలలో మార్చి నెల జీతాల పంపిణీకి ముందు బకాయిలు చెల్లించబోమని తెలిపింది.

Also read: మాధవీలతకు బీజేపీ బిగ్‌ షాక్‌.. నో బీఫామ్ ?

ఇక వివరాల్లోకి వెళ్తే.. మార్చి 7న కేంద్ర కేబినెట్ డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ)లో 4 శాతం పెంపును ప్రాథమిక వేతనంలో 50 శాతానికి పెంచింది. కోటిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే 4 శాతం డీఏ పెంపు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే హెచ్‌ఆర్‌ఏను కూడా పెంచారు. అయితే డీఏ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.12,868 కోట్ల భారం పడనుంది. అక్టోబర్ 2023లో మునుపటి డీఏ పెంపులో ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్(DA), డియర్‌నెస్ రిలీఫ్‌ను 4 నుంచి 46 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం 4 శాతం డిఏ పెంపును ప్రకటించడంతో.. ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం నెలకు రూ.50 వేలు అనుకుంటే అందులో అతను లేదా ఆమెకు ప్రాథమిక వేతనం రూ.15,000గా ఉంటుంది. దీంతో ఆ ఉద్యోగి ప్రస్తుతం మూల వేతనంలో 46 శాతం అంటే రూ.6,900 పొందుతున్నారు. 4 శాతం పెంపు తర్వాత ఇప్పుడు రూ.7500 పొందుతారు. అంతకుముందు దానితో పోలిస్తే రూ.600 ఎక్కువ. ఆల్-ఇండియా సీపీఐ-ఐడబ్ల్యూకు సంబంధించి12 నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగానే డీఏ, డీఆర్‌ పెంపును నిర్ణయిస్తారు.

Also Read: తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

హైదరాబాద్  సన్ రైజర్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోయినట్లే. ఈరోజు కూడా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి వరుసగా నాలుసార్లు ఓటమిని చవి చూసింది. ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ మ్యాచ్ ను పోగొట్టుకుంది. 

New Update
ipl

GT VS SRH

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ మళ్ళీ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ ఇచ్చిన 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.  గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 61 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 49 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్స్ లో షమీ 2, రమిన్స్ ఒక వికెట్ తీశారు.  

గుజరాత్ బౌలర్లు తాట తీశారు..

అంతకు ముందు ఉప్పల్ స్డేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో  కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు.  ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను మొదట్లోనే  వెనక్కి పంపిన సిరాజ్.. డేంజరెస్ ఆటగాడు అనికెత్ వర్మ(18) ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27), పాట్ కమ్మిన్స్ (22) పరుగులు చేశారు.  గుజరాత్ బౌలర్ లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు.  

today-latest-news-in-telugu | IPL 2025 | gt-vs-srh 

Also Read: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
Advertisment