Gold Rates : బాబోయ్ బంగారం.. షాక్ మామూలుగా లేదు.. ఎంత పెరిగిందంటే..

బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 400 పెరిగి రూ.58,900ల వద్దకు, 24 క్యారెట్ల బంగారం 430 పెరిగి రూ.64,250లకు చేరుకున్నాయి.  ఇక వెండి ధర కూడా కేజీకి 300 పెరిగి రూ.81,100ల వద్దకు చేరుకుంది.

New Update
Gold Price in Hyderabad: దిగివస్తున్న బంగారం ధరలు..పెరిగిన వెండి..ఈరోజు ఎంతంటే.. 

Gold Rate Today : ఈ బుధవారం నుంచి  పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతున్నాయి.  వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఈ పెరుగుదలతో మరింత పైకి చేరుకున్నాయి. బంగారం ధరల పరుగులు ఎప్పుడు ఆగుతాయో అని బంగారం కొనాలని అనుకునే వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పట్లో ఆ అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతూనే ఉంది. డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరగడంతో ఆల్ టైమ్  హైకి చేరుకున్నాయి. పది గ్రాముల బంగారం 65వేళా దగ్గరకు చేరుకొని రికార్డ్ సృష్టిస్తోంది.  ఈరోజు అంటే డిసెంబర్ 29న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధరల్లోపెరుగుదల కనిపించడంతో  దేశీయంగాను బంగారం ధరలు(Gold Rates) పైకెగశాయి. మరోవైపు నిన్న కాస్త తగ్గినట్టు కనిపించిన వెండి ధరలు ఈరోజు అదే స్థాయిలో పెరిగాయి.  ఈరోజు అంటే శుక్రవారం (డిసెంబర్ 29) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.     

హైదరాబాద్(Hyderabad) లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates) 400 రూపాయలు పెరిగింది. దీంతో  రూ.58,900ల వద్ద చేరుకుంది.  24 క్యారెట్ల బంగారం కూడా 430 రూపాయలు పెరిగి రూ. 64,250ల వద్దకు చేరింది.  అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి.  ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు పెరిగి రూ.59,050ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) ధర 440 రూపాయలు పెరిగి  రూ.64,400ల వద్దకు చేరుకుంది. 

ఇక వెండి ధరలు నిన్న కాస్త తగ్గినట్టు కనిపించినా.. ఈరోజు అదేస్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. వెండి ధరలు కేజీకి 300 రూపాయలు పెరిగాయి. దీంతో  హైదరాబాద్ లో వెండి కేజీకి  రూ.81,100ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు కేజీకి 300 రూపాయలు పెరిగింది.  దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ.79,500లుగా ఉంది.  

Also Read:  బంగారం మళ్ళీ పైపైకి.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే.. 

అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు(Gold Rates) రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rates)  2068 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర(Silver Rate) ఔన్స్ 23.94 డాలర్లుగా కొనసాగుతోంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు