Gold Rate: గుడ్ న్యూస్...పండుగ ముందు తగ్గుతున్న బంగారం ధరలు బంగారం ప్రియులకు మంచి రోజలు వచ్చాయి. కొన్ని రోజులుగా కొండెక్కి కూర్చున్న పసిడి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్‌లో బంగారం ధర పడిపోతోంది. By Manogna alamuru 08 Nov 2023 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Gold Rate: అక్టోబర్ నెల మొత్తం అంతా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు రూ. 5 వేల వరకు పెరిగి ఆల్ టైం హైకి కూడా చేరింది. కానీ ఇప్పుడు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల (US fed interest rate) మీద కీలక నిర్ణయం తీసుకోవడంతో మళ్ళీ రేట్లు తగ్గుముఖం పట్టాయి. ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో డాలర్ రేటు పెరుగుతున్నప్పటికీ బంగారం ధర మాత్రం తగ్గుతోంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సు ప్రస్తుతం 1968 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు 22.55 డాలర్ల వద్ద కొనసాగుతోంది. Also Read: మరో ఘనత సాధించిన ఆదిత్య ఎల్1.. సౌరజ్వాలను క్లిక్‌మనిపించిన వ్యోమనౌక అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర (Gold Rate) పడిపోవడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్ మీదా కనిపిస్తోంది. దీంతో మన మార్కెట్లలో పసిడి ధర నాలుగు రోజులుగా తగ్గుతోంది. హైదరాబాద్‌లో (Hyderabad) 22 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ. 100 పడిపోయి.. తులం గోల్డ్ రేటు ప్రస్తుతం రూ. 56,250 వద్ద ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ విషయానికి వస్తే రూ. 110 ఎగబాకి తాజాగా 10 గ్రాముల బంగారం రేటు రూ. 61,360 వద్ద కొనసాగుతోంది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు దేశ రాజధాని ఢిల్లీలోనూ పుత్తడి రేటు పతనమైంది. అక్కడ 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 100 పడిపోయి తులం రూ. 56,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ .110 చొప్పున పతనమై తులం రూ. 61,510 వద్ద ఉంది. మరోవైపు కొద్దిరోజులుగా పెరుగుతూ వచ్చిన సిల్వర్ ధర కూడా ఇవాళ తగ్గింది. ఢిల్లీలో తాజాగా రూ. 700 తగ్గి కిలోకు రూ. 74,500 వద్ద ట్రేడవుతోంది. ఇదే వెండి (Silver Price) హైదరాబాద్ మార్కెట్లో రూ. 700 పడిపోయి కేజీ సిల్వర్ రేటు రూ. 77,500 వద్ద ఉంది. Also Read:హైబీపీ ఉందా ? తరచూ నొప్పి మందులు వాడుతున్నారా ? ప్రమాదంలో పడ్డట్లే #gold-price #gold-rate-in-hyderabad #gold-rate-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి